వియత్నాం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు దక్షిణ వియత్నాంలోని హోచిమిన్ నగరంలో న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా థాన్ నీన్ తెలిపింది. 67 ఏళ్ల వాన్ థిన్ ఫాట్, రియల్ ఎస్టేట్ కంపెనీలో భాగంగా అధికారికంగా ఏకంగా 12.5 బిలియన్ల డాలర్స్ మోసానికి పాల్పడ్డారు. ఇకపోతే ఇది ఆ దేశం యొక్క 2022 జీడీపీలో దాదాపు 3% నికి సమానం.
ALSO READ: Chandrababu: పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
వాన్ 2012 నుండి 2022 మధ్యలో సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ ను చట్టవిరుద్ధంగా నియంత్రించి 2,500 రుణాలను అనుమతించారు, దీని ఫలితంగా బ్యాంకుకు $27 బిలియన్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర మీడియా నివేదించింది. ఇక ఇందుకుగ్గాను బ్యాంకుకు 26.9 మిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆమెను కోరింది.
ALSO READ: Sriranga Neethulu Review: శ్రీరంగనీతులు రివ్యూ
గత నెలలో, వో వాన్ థుంగ్, అవినీతి నిరోధక డ్రైవ్ లో చిక్కుకోవడంతో కంపెనీకు రాజీనామా చేశారు. వాన్ థిన్ ఫాట్ వియత్నాం యొక్క అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. ఈ కంపెనీ విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, షాపింగ్ కేంద్రాలు మరియు హోటళ్లతో సహా ప్రాజెక్ట్ లను డీల్ చేస్తుంది. చైనా నుండి తమ సరఫరా తగ్గించడానికి ప్రయత్నిస్తున్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయ ప్రదేశంగా వియత్నాం తనను తాను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ మోసం ఆందోళన కలిగించింది. 2023లో, వియత్నాంలో ఏకంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నుండి 1,300 ప్రాపర్టీ సంస్థలు వైదొలిగాయి. దాంతో ఈ రంగానికి భారీ దెబ్బ తగిలింది. ఇక అలాగే వియత్నాం యొక్క అవినీతి వ్యతిరేక డ్రైవ్ అగ్ర రాజకీయ నాయకులను విడిచిపెట్టలేదు.