యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ కథలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తునే ఉంటాడు. ‘కౌసల్యా కృష్ణమూర్తి’, ‘అథర్వ’ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు ప్రస్తుతం శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ చిత్రంలో నటిస్తున్నాడు. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.ఇక తాజాగా ..
ఈ ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగగా, ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాస రావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా.. హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇందులో భాగంగా దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ ..
‘1980 లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నాము. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కార్తీక్ రాజు, కాజల్ చౌదరి గార్లతో ఈ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మా నిర్మాత గాలి కృష్ణ గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా కోసం వచ్చిన సురేష్ బాబు గారు, తమ్మారెడ్డి గారు, భీమనేని శ్రీనివాసరావు గారు, క్రాంతి మాధవ్ గారు, చైతన్య గారికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. అలాగే.. హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ .. ‘80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. కాజల్ చౌదరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజా దుస్సా, నిర్మాత గాలి కృష్ణ గారికి థాంక్స్. మున్ముందు మా సినిమా నుంచి మరిన్ని అప్డేట్‌లు వస్తాయ’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.