Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని ఒకటి లేదా రెండు కీలక లక్ష్యాలను ఇప్పటికీ ఉపసంహరించుకోవాల్సి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న ‘పిక్‌యాక్స్ మౌంటెన్’ వంటి స్థావరాలను తాము కేవలం 10 నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలమని ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ వారు నమ్మదగినవారు కాదని, అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడేది లేదని సంకేతాలిచ్చారు. అమెరికాలో వచ్చే వారం జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్లను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఏ రకమైన బెదిరింపు ఎదురైనా తక్షణమే భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్లతో జరిగిన సమావేశంలో తెలిపారు. అలాగే అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి చెందిన అన్ని రకాల ఆస్తులను తమ లక్ష్యాల జాబితాలో చేర్చాలని సైన్యాన్ని ఆదేశించారు. తమ పూర్వ నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొజ్తాబా ఖమేనీ, సైనిక ఉన్నతాధికారులతో ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి.
Also Read
- Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
- Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
- Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
- State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
NYT: “Do you expect to go back to war against Iran as soon as this week?”
@POTUS: “Why would you ask such a stupid question? Let’s say I did — would I tell you?” https://t.co/u5xDlkkXQ9
— Rapid Response 47 (@RapidResponse47) November 1, 2026
గత ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఆ దాడుల్లో అలీ ఖమేనీ మరణించగా, ప్రతికారంగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడమే కాకుండా కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత జూన్‌లో ఇరు దేశాల మధ్య 14 అంశాల శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, అది కొద్దిరోజులకే రద్దయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఢీ అంటే ఢీ అనేలా రెండు దేశాలు ప్రకటనలు చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
-
Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!