Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
- యుద్ధ తీవ్రత తగ్గించే దిశగా అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు పరస్పరం తమ ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయకూడదని అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముందడుగుగా అభివర్ణించారు. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్ రష్యా ఎనర్జీ లక్ష్యాలపై దాడులు చేయకూడదని అంగీకరించింది. రష్యా కూడా అదే విధంగా వ్యవహరించేందుకు అంగీకరించింది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమేనని ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం వల్ల కాదని స్పష్టం చేశారు. అంతకుముందు ఆదివారం కూడా ట్రంప్.. రష్యాలోని డీజిల్ మౌలిక వసతులపై దాడులు చేయకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా డీజిల్ కొరత ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. లక్ష్యాలపై దాడులు చేయడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అయితే డీజిల్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవద్దని ట్రంప్ సూచించారు. ఇలాంటి దాడుల వల్ల డీజిల్ కొరత ఏర్పడుతోందని అన్నారు.
Also Read
ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా స్వాగతం
ఉక్రెయిన్.. రష్యా డీజిల్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ చేసిన పిలుపును రష్యా స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను సానుకూలంగా చూస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ‘‘పౌర, ఆర్థిక మౌలిక వసతులపై దాడులు నిలిపివేయాలని కీవ్ ప్రభుత్వాన్ని కోరడం స్వాగతించదగిన విషయమే’’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఏర్పడిన తీవ్ర అస్థిరతకు ప్రధాన కారణం గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాలేనని క్రెమ్లిన్ పేర్కొంది.
విట్కాఫ్, కుష్నర్ పర్యటన తర్వాత
అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ నెల ప్రారంభంలో మాస్కో, కీవ్‌లలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో వారు విడివిడిగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలతో యుద్ధాన్ని ముగించే విషయంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. వారాంతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అనంతరం కూడా రష్యా, ఉక్రెయిన్ మరోసారి తీవ్ర వైమానిక దాడులకు దిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర ఎనర్జీ మౌలిక వసతులపై దాడులు చేయకూడదన్న అంగీకారం యుద్ధ తీవ్రతను తగ్గించే దిశగా ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- Donald Trump
- Russia
- trump
- Ukraine
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!