Donald Trump: అమెరికా నిఘా నివేదికను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో జమాల్ ఖషోగ్గి హత్యపై తన సొంత నిఘా సంస్థల నివేదికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. 2018లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి క్రౌన్ ప్రిన్స్‌కు ఏమీ తెలియదని ట్రంప్ నొక్కి చెప్పారు. 2018 హత్యకు సంబంధించి ABC న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. “మీరు నకిలీ వార్తలు ప్రసారం చేయకండి… మా అతిథిని ఇబ్బంది పెట్టకండి… మీరు మాట్లాడుతున్న ఖషోగ్గి చాలా మందికి నచ్చలేదు.. మీరు అనుకుంటున్నట్టు మహమ్మద్ బిన్ సల్మాన్ అతడిని ఏమీ చేయలేదు. మీరు అలాంటి ప్రశ్న అడగడం ద్వారా మా అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు” అని ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
READ MORE: Killer : “కిల్లర్” మూవీ అందరినీ థ్రిల్ చేస్తుంది : డైరెక్టర్ పూర్వజ్
అమెరికా రిపోర్టులో ఏముంది..?
వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా గతంలో సంచలన ప్రకటన చేసింది. ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజును నిందితుడిగా పేర్కొంటూ అమెరికా గతంలో ప్రకటన చేసింది. ఆయన అనుమతితోనే ఖషోగ్గీని ఇస్తాంబుల్‌లో హత్యచేశారని పేర్కొంది. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీని పట్టుకోవడం లేదా చంపడానికి నిర్వహించే ఆపరేషన్‌కు సౌదీ యువరాజు ఆమోదం వేశాడని తెలిపింది. యువరాజు మొహమ్మద్ ప్రభావాన్ని చూస్తే 2018లో జరిగిన హత్య ఆయన ప్రమేయం లేకుండా జరగడం చాలా అరుదు అని నివేదిక పేర్కొంది. ఈ హత్య విదేశాలలో తన అసమ్మతివాదులను నోళ్లేత్తుకుండా చేయడానికి, యువరాజు హింసాత్మక చర్యలకు సరిపోతుందని వ్యాఖ్యానించింది. వాషింగ్టన్ పోస్ట్‌లో యువరాజుపై తరుచూ విమర్శనాత్మక కథనాలను రాస్తూ ఆయన ఆగ్రహానికి గురయ్యాడని తెలిపింది.
READ MORE: Skin Cancer Symptoms: ఈ లక్షణాలు చర్మ క్యాన్సర్‌కు సంకేతాలు..