Killer : జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ నిర్మిస్తున్నారు. పూర్వజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు. ఈవెంట్ లో కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతి పూర్వజ్ కు ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్లు పెట్టామన్నారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. ఈ సినిమాలోకి వైల్డ్ కార్డులా ఎంట్రీ ఇచ్చాను. ఇందులో కొత్త తరహా విలన్ గా కనిపిస్తానని చెప్పారు.
Read Also : Hyper Aadi : రాజమౌళి దేవుడిని అవమానించలేదు: హైపర్ ఆది
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. నేను డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. యాక్షన్ మూవీ చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వజ్ కు చెప్పాను. ఈ “కిల్లర్” సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశానని మా యూనిట్ వాళ్లు చెబుతున్నారు. పూర్వజ్ చెప్పినట్లూ చేస్తూ వెళ్లా. మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అని తెలిపారు.
డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ.. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఈ సినిమాలో జ్యోతి పూర్వజ్ ఐదు రోల్స్ లో కనిపిస్తుంది. చాలా సస్పెన్స్ గా ఉంటుంది మూవీ. స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఇలా ఐదు పాత్రల్లో అద్భుతంగా నటించింది. ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఇప్పుడు చూసిన గ్లింప్స్ అయినా, సాంగ్ అయినా మా రష్ లో 3 పర్సెంట్ కూడా ఉండవు. మిగతా కంటెంట్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది అన్నారు.
Read Also : Akhanda 2 : అఖండ2 నుంచి మరో సాంగ్ రిలీజ్.. బాలయ్య, సంయుక్త స్టెప్పులు