Donald Trump: అమెరికా అధ్యక్షుడితో మామూలుగా ఉండదని అంటుంది ప్రపంచం. ఎందుకని అనుకుంటున్నారు.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడానికి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డూ ఆర్ డై గేమ్ ఆడుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోబెల్‌ను దక్కించుకోడానికి తుది ప్రయత్నంగా చేస్తుంది ఏంటో తెలుసా? గాజా యుద్ధాన్ని ముగించడం అంటా. ఇది సాధించి అవార్డు కోసం బలమైన హక్కును సంపాదించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మనోడి ప్రయత్నం ఫలిస్తుందో కాదో చూద్దాం..
READ ALSO: Kantara 1 : రిషబ్ శెట్టిపై తెలుగు యువత ఆగ్రహం.. ఇంత చిన్న చూపా..?
నేడు కీలక సమావేశం..
సెప్టెంబర్ 29న అధ్యక్షుడు ట్రంప్ గాజా కాల్పుల విరమణకు సంబంధించి ఒక ప్రధాన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి ప్రతిపాదనలను ఖరారు చేసినట్లు టాక్. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత, ఈ ప్రతిపాదనలను హమాస్‌కు పంపించనున్నారు. అక్టోబర్ 1 నాటికి గాజాలో యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్టోబర్ 10న స్వీడిష్ నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు.
గాజా శాంతితో ట్రంప్ ఆశ నెరవేరబోతుందా..
2023 అక్టోబర్ నుంచి గాజాలో 65 వేల మందికి పైగా మరణించారు. యూరోపియన్, అరబ్ దేశాలు ఈ యుద్ధానికి ఇజ్రాయెల్‌ను నిందిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉంది. ఇటీవల ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ UNలో మాట్లాడుతూ.. ట్రంప్ గాజా యుద్ధాన్ని ఆపగలిగితే, ఆయనకు నోబెల్ బహుమతి వచ్చేదని అన్నారు. నాటి నుంచి అమెరికా అధ్యక్షుడి కార్యాలయం గాజాలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఈ విషయంలో పురోగతి సాధించడానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిని వైట్ హౌస్ కు ఆహ్వానించారు.
నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి అర్హతలు ఏంటో తెలుసా..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి కావాలనుకుంటున్నాడు ఓకే. కానీ మనోడికి ఈ అర్హతలు ఉన్నాయా.. అసలు నోబెల్ శాంతి బహుమతికి అర్హతలు ఏంటో తెలుసా.. దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, స్టాండింగ్ ఆర్మీలను రద్దు చేయడం, తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషించిన వాళ్లకు, శాంతి సమావేశాలను స్థాపించడంలో, వాటిని ప్రోత్సహించడంలో ఉత్తమంగా పనిచేసిన సంస్థ లేదా వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు.
అధ్యక్షుడైన ఏడు నెలల్లోనే ఏడు యుద్ధాలను ఆపానని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు తాను హామీ ఇచ్చిన యుద్ధాన్ని (రష్యా-ఉక్రెయిన్ యుద్ధం) మాత్రం ట్రంప్ ఇంకా ఆపలేకపోయారు. కంబోడియా, పాకిస్థాన్ వంటి దేశాలు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్న సందర్భంగా ట్రంప్ కూడా నోబెల్ కోరికను వ్యక్తం చేశారు. చూడాలి మరి మనోడి కల అక్టోబర్ 10న నెరవేరబోతుందో లేదో..
READ ALSO: IAF Tejas Delay: భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్.. పాక్, చైనాలకు వరం అవుతుందా?