Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump vs Meloni: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య నెలకొన్న సుదీర్ఘ రాజకీయ మైత్రి ఒక్కసారిగా ముక్కలైంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సులో జార్జియా మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడింది (begged) అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం కల్పిత కథలని, ఆయన వ్యాఖ్యలు తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేశాయని మండిపడ్డారు. అమెరికా లాంటి పెద్ద దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ తన మిత్రదేశాల పట్ల ఇలాంటి ప్రవర్తన కనబరచడం తీవ్ర నిరాశకు గురిచేసిందని, పైగా ట్రంప్ ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారేమీ కాదని ఘాటుగా విమర్శించారు.
నిజానికి ఇటలీకి చెందిన ‘లా7’ (La7) అనే టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీ7 సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధాని అంశాన్ని ట్రంపే స్వయంగా ప్రస్తావిస్తూ.. “సదస్సులో నేను ఆమెతో మాట్లాడినందుకు బహుశా సంతోషించి ఉండవచ్చు. నిజానికి నేను ఆమెతో మాట్లాడాల్సిన అవసరమే లేదు” అని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా, మెలోని తనతో ఫోటో దిగడానికి ఎంతగానో ఆరాటపడిందని, తనను బతిమలాడిందని క్లెయిమ్ చేశారు. “ఆమె నన్ను ఒక ఫోటో కోసం బతిమలాడింది. నాతో ఫోటో దిగాలని ఆమెకు ఎంతగానో ఉండింది. నిజానికి నేను ఫోటో దిగి ఉండేవాడిని కాదు, కానీ ఆమెను చూసి పాపం అనిపించి ఒప్పుకున్నాను” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఛానల్ కేవలం డబ్బింగ్ ఆడియోను మాత్రమే ప్రసారం చేసింది, ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోను విడుదల చేయలేదు.
Also Read
- Imran Khan: తక్షణమే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై శుక్రవారం జార్జియా మెలోని అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల మృదువుగా ఉండే ట్రంప్, మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అమెరికా లేదా పాశ్చాత్య దేశాల శత్రువులైన నేతల పట్ల ట్రంప్ చూపే అమితమైన ఉదారత, లాలన.. సొంత మిత్రులపై చూపించకపోవడం విచారకరమని విమర్శించారు. చివరగా ట్రంప్‌కు ఒక గట్టి హెచ్చరిక లాంటి సందేశాన్ని ఇస్తూ.. “ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైనా, ఇటలీ దేశమైనా ఎవరినీ ఎప్పుడూ బతిమలాడవు” అని మెలోని అత్యంత స్పష్టంగా, గర్వంగా ప్రకటించారు.
ఇక, జీ7 సదస్సు వీడియో ఫుటేజీలను గమనిస్తే ట్రంప్, మెలోని ఇద్దరూ ఒక చిన్న సోఫాపై కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం కనిపించింది. కానీ ట్రంప్ మాత్రం తానేదో ఆమెపై జాలిపడి మాట్లాడినట్లు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒకప్పుడు యూరప్‌లోనే ట్రంప్‌కు అత్యంత బలమైన మద్దతుదారుగా మెలోని పేరుగాంచారు. 2025లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు హాజరైన ఏకైక యూరోపియన్ లీడర్ కూడా ఆమెనే కావడం విశేషం. అయితే, ఇరాన్ వివాదంలో పోప్ లియో తీసుకున్న నిర్ణయాన్ని, శాంతి పిలుపును ట్రంప్ తప్పుబట్టడంపై మెలోని అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ట్రంప్ దూకుడు వైఖరిని ఖండిస్తూ మెలోని దూరం జరగడంతో ఆమెకు ధైర్యం లేదంటూ ట్రంప్ గతంలో విమర్శలు గుప్పించారు. ఈ తాజా ఫోటో వివాదం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభానికి దారితీసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ తీవ్ర అవమానంగా భావించింది. ప్రధాని మెలోనిని, ఇటలీ దేశాన్ని అవమానించేలా ఉన్న ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజాని తన అమెరికా పర్యటనను తక్షణమే రద్దు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
-
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
-
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
-
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
-
Imran Khan: తక్షణమే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!