అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ జెట్ వేగంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో, వాటిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విడుదల చేశారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించడం, వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచడం, జన్మహక్కు(బర్త్ రైట్) పౌరసత్వాలను నిషేధిస్తూ ఆర్డర్లపై సంతకాలు చేశారు.