తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: కడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయరంగానకిప్రోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి బీజే పీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కును బీజేపీ కోల్పోయిందన్నారు. పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ని ధాన్యం కొనకుండా ఆదేశాలు జారీ చేస్తు అటూ సంస్థను, ఇటు రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ధనిక పారిశ్రా మిక వేత్తలకు రుణాల మాఫీ చేశారు. కానీ రైతులను ఎనాడు పట్టించు కోలేదన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఏడాది కాలంగా రైతు లను హింస పెట్టారన్నారు. 600 మంది రైతుల బలి దానాల తర్వాత రైతు చట్టాల ఉపసంహారణ రైతుల మీద ప్రేమతో చేశారా లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు పంజాబ్‌లో కొన్నట్టు తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరని ఆయన మండిపడ్డారు. రాష్ర్ట బీజేపీ నేతలకు కేంద్రం దగ్గరికి వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదన్నారు.
ఇప్పటికైనా కేంద్రం ధాన్యం ఎంత కొంటారో చెప్పాలని, తెలంగాణ రైతులను ఇబ్బందుల పాలు చేయోద్దని ఆయన హితవు పలికారు. రైతుల మీద చిత్త శుద్ధి ఉంటే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని కడియం శ్రీహరి అన్నారు. రైతు పంటల ఫసల్‌భీమా పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఆ డబ్బులు సకాలంలో రాక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.
Also Read
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!