‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేశ్ భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. 2025 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ, వెంకీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో వెంకటేశ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకీ సినిమా ఉంటుందని వార్తలు రాగా.. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ గురువారం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
‘డైరెక్టర్ త్రివిక్రమ్ గారి తదుపరి 2 ప్రాజెక్టులు జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్‌తో లాక్ అయ్యాయి. మిగతావన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ త్రివిక్రమ్ సినిమాలు కన్ఫార్మ్ అయితే నేనే అధికారికంగా ప్రకటిస్తా’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో రామ్ చరణ్ ప్రాజెక్ట్ లేనట్టే అని తేలిపోయింది. అలానే అల్లు అర్జున్‌తో సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా కేవలం ప్రచారం మాత్రమే అని క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ ప్రస్తుతానికి ఎన్టీఆర్, వెంకటేశ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారని తేలిపోయింది.
Also Read: Air India Plane: లండన్ వెళ్తూ.. వెనక్కి వచ్చేసిన ఎయిర్ ఇండియా విమానం!
త్రివిక్రమ్ ముందుగా వెంకటేశ్‌తో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ మొదలౌతుందని సమాచారం. ఈ రెండు సినిమాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. వెంకీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. దాంతో ఈ కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. జులై లేదా ఆగస్టులో త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.