Triptii Dimri : త్రిప్తి డిమ్రి.. యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా అలాంటి బోల్డ్ పాత్రలే చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. తన ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్యాన్స్.. ఇలా ఎవరేమన్నా ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా తన కొత్త సినిమాలో తాను మేరే మెహబూబ్ సాంగ్ కోసం వేసిన స్టెప్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నా.. వాటిని పెద్దగా పట్టించుకోవద్దంటూ ఆమె చెప్పడం విశేషం. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూస్ సినిమాలో తన అందచందాలతో ఆకట్టకుంది. తాజాగా త్రిప్తి దిమ్రి ఓ వివాదంలో ఇరుక్కుంది. గతంలో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క యానిమల్ సినిమాతో రావడంతో అమ్మడి స్టార్ డమ్ తిరిగిపోయింది. దీంతో సినిమా అవకాశాలు, యాడ్స్, ఈవెంట్లు క్యూలు కట్టాయి. అందరి హీరోయిన్స్ లాగే పలు ఈవెంట్స్ కు హాజరవుతూ కోట్లలో డబ్బులు సంపాదించుకుంటుంది. అయితే ఇటీవల జైపూర్ లో జరిగిన మహిళా వ్యాపారవేత్తల ఈవెంట్ కి వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆ వ్యాపారవేత్తల కమిటీ త్రిప్తి దిమ్రిని వివాదంలో నిలిపారు.
Read Also:Prince : సైకలాజికల్ థ్రిల్లర్ “కలి” నుండి రొమాంటిక్ మెలొడీ సాంగ్ రిలీజ్
త్రిప్తి దిమ్రి జైపూర్ కి చెందిన మహిళా వ్యాపారవేత్తల FICCI FLO అనే ఈవెంట్ కి హాజరు కావాల్సి ఉంది. వాళ్లు అప్పటికే అమ్మడు అడిగినంత డబ్బులు ముట్టజెప్పారు. డబ్బులు తీసుకొని మరీ దీనికి రాకపోవడంతో ఆ ఈవెంట్లో త్రిప్తి దిమ్రి ఫొటోతో వేసిన బ్యానర్ పై కొంతమంది మహిళలు ఆగ్రహంతో బ్లాక్ పెయింట్ పూశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఆ ఈవెంట్ నిర్వహించిన ఓ మహిళా వ్యాపారవేత్త మీడియాతో మాట్లాడుతూ.. త్రిప్తి దిమ్రి ఈవెంట్ కి హాజరు అవుతాను అని ఐదున్నర లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలయ్యే ముందు కూడా అయిదు నిమిషాల్లో వచ్చేస్తానని కాల్ చేసి చెప్పింది. కానీ ఈవెంట్ కి హాజరు కాలేదు. ఆమె బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. రాను అని మాకు ముందే సమాచారం ఇవ్వలేదు. ఆమెపై మా టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. జైపూర్ లో ఆమె సినిమాలు బ్యాన్ చేస్తాం, ఆమె మా అందరినీ మోసం చేసింది అంటూ ఫైర్ అయింది. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది. మరి దీనిపై త్రిప్తి దిమ్రి స్పందిస్తుందో చూడాలి మరి.
This is so bad, ya! Just because #TriptiiDimri is a celeb that doesnt give anyone the right to do such things for a meagre 5 L.
Not only her, many actors will be scared to attend ficci flo’s events #VickyVidyaKaWohWalaVideo
— Bollywood Talkies (@bolly_talkies) October 1, 2024
Read Also:Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ముగ్గురు మృతి..