రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.