Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ లో వినోదాన్ని పంచుతూ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఉప్పలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఇప్పటికే ఏప్రిల్ 2న ఇదే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు.. అదే.. ఇక మన హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ భాగ్యనగరంలో మరో మ్యాచ్ జరుగనుంది. దీంతో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
Also Read : IPL 2023 : సన్ “రైజ్” అవుతుందా.. హ్యాట్రిక్ పై పంజాబ్ నజర్
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ఇవాళ సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు. ప్రధానంగా వరంగల్ రహదరిపై వచ్చే వాహనాలను చెంగిచర్ల చౌరస్తా నుంచి చర్లపల్లి ఎన్ఎఫ్సీ వైపు మళ్లీస్తున్నారు. అలాగే ఎల్బీనగర్ నుంచి వచ్చే విహనాలను హెచ్ఎండీఏ లే అవుట్ బోడుప్పల్, చెంగిచర్ల చౌరస్తా వైపు.. మల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలను నాచారం ఐడీఏ మీదుగా చర్లపల్లి వైపు మళ్లీంచనున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
Also Read : Drunk and Drive: ఓరేయ్ ఆజాము లగెత్తండ్రోయ్.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు తమ వెంట ఎటువంటి వస్తువులు తీసుకురావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్టేడియంలోకి అనుమతించనున్నారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు అందిస్తున్నామని రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న సీపీ చౌహన్.. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని తెలిపాడు. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు స్టేడియం పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. అదేవిధంగా బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని సీపీ చౌహాన్ హెచ్చరించారు. టికెట్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందన్న ఆయన.. ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది. దీంతో పాటు అటు మెట్రో సర్వీసులను కూడా పొడించారు.

తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?