రేపు మధ్యాహ్నం 1. 04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు చెప్పారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.