Site icon NTV Telugu

Sama Ram Mohan Reddy : కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే

Sama Ram Mohan Reddy

Sama Ram Mohan Reddy

Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ కలిసి ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడో, రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్

అంతేకాకుండా, సంతోష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ లు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం జయలలిత చివరి దశ లాగా తయారైందని, తన కుటుంబాన్ని చీల్చేస్తున్న దాడులపై ఆయన నిస్సహాయంగా మారిపోయారు అని రామ్మోహన్ విమర్శించారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె స్వంత పార్టీ పెట్టే అవకాశముందని వెల్లడించారు.

కవితతో సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని కేటీఆర్ కు ఆసక్తి లేదని తెలుస్తోందని, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే ఇప్పుడు కుటుంబాన్ని విభజిస్తున్నాయన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడితే గతంలో కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లే, ఇప్పుడు తనపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు రామ్మోహన్‌ రెడ్డి.

కేసీఆర్‌ను ఎవరు కలవాలో, ఎవరు కలవకూడదో కూడా ఇప్పుడు సంతోష్ నిర్ణయిస్తున్నాడని, ఎమ్మెల్యేల నుంచి డబ్బులు తీసుకుని కేసీఆర్ దర్శనం కలిగిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి–బిడ్డల మధ్య ఈ అంతరాన్ని సృష్టించిందెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేటీఆర్, తమ పార్టీ లోపల జరిగే వివక్ష, కుట్రలపై ఎందుకు స్పందించడని రామ్మోహన్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చే ముందు, తమ పార్టీలో జరుగుతున్న భిన్నాభిప్రాయాలను చక్కదిద్దుకునే పనిలో కేటీఆర్ నిమగ్నమవ్వాలి అని హితవు పలికారు.

Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్

Exit mobile version