Sama Ram Mohan Reddy : కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే
- కవితను సస్పెండ్ చేయడానికి బీఆర్ఎస్ లో స్కెచ్
- కేసీఆర్ నిస్సహాయ స్థితిలో జయలలిత లాంటి దశలో ఉన్నారు
- కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ : రామ్మోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ కలిసి ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడో, రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
అంతేకాకుండా, సంతోష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ లు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం జయలలిత చివరి దశ లాగా తయారైందని, తన కుటుంబాన్ని చీల్చేస్తున్న దాడులపై ఆయన నిస్సహాయంగా మారిపోయారు అని రామ్మోహన్ విమర్శించారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె స్వంత పార్టీ పెట్టే అవకాశముందని వెల్లడించారు.
కవితతో సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని కేటీఆర్ కు ఆసక్తి లేదని తెలుస్తోందని, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే ఇప్పుడు కుటుంబాన్ని విభజిస్తున్నాయన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడితే గతంలో కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లే, ఇప్పుడు తనపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి.
కేసీఆర్‌ను ఎవరు కలవాలో, ఎవరు కలవకూడదో కూడా ఇప్పుడు సంతోష్ నిర్ణయిస్తున్నాడని, ఎమ్మెల్యేల నుంచి డబ్బులు తీసుకుని కేసీఆర్ దర్శనం కలిగిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి–బిడ్డల మధ్య ఈ అంతరాన్ని సృష్టించిందెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేటీఆర్, తమ పార్టీ లోపల జరిగే వివక్ష, కుట్రలపై ఎందుకు స్పందించడని రామ్మోహన్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చే ముందు, తమ పార్టీలో జరుగుతున్న భిన్నాభిప్రాయాలను చక్కదిద్దుకునే పనిలో కేటీఆర్ నిమగ్నమవ్వాలి అని హితవు పలికారు.
Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!