Site icon NTV Telugu

TPCC Mahesh Goud : బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారు

Mahesh Kumar

Mahesh Kumar

TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని, పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని ఆయన మండిపడ్డారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని మహేష్ గౌడ్‌ ఆరోపించారు. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్ అని ఆయన ఆయన ధ్వజమెత్తారు. పదేళ్లలో మోడీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదమని, కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా? అని మహేష్‌ గౌడ్‌ ప్రశ్నించారు.

Trisha : అలాంటి పరిస్థితి నాకు రాకూడదు.. అందుకే పెళ్ళి వద్దు

బీజేపీ కి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారని, బీజేపీపై బీఆర్ఎస్ ప్రేమతోనే HCu పై రెండు పార్టీ నేతల దుష్ప్రచారమన్నారు. సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందని, లోకల్ బాడీ ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయమన్నారు. పదిహేను నెలల స్పల్ప కాలంలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలివ్వడం, రైతు, మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, పేదలకు సన్న బియ్యం అందించడం వంటి గొప్ప పనులను రేవంత్‌ రెడ్డి సర్కార్‌ చేపట్టినా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది

Exit mobile version