తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కమిటీల లొల్లి నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? అనే అనుమానం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీకి వచ్చిన నిధులపై రేవంత్ ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు లేఖ పంపింది ఎన్నికల సంఘం. దీనిపై విచారణ పూర్తికాకముందే బీఆర్ఎస్ గా గుర్తించడం ఏంటని అంటున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మీద రేవంత్ రె్డి వేసిన పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్ట్ విచారణ జరిపింది. అభ్యంతరాలు ఉన్న శాఖలపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని ఢిల్లీ హైకోర్ట్ సూచించింది. కేసు విచారణను ముగించిన హైకోర్ట్.. మరో పిటిషన్ వేసుకునే అవకాశం ఇచ్చింది.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు లేఖ పంపింది. పార్టీ పేరు మార్పు కోరుతూ అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది. డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు మంచి ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ నూతన జెండాను కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోనూ పార్టీ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం అయింది.
బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం.
దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? pic.twitter.com/Qx1lo0oZI7
— Revanth Reddy (@revanth_anumula) December 19, 2022