TPCC Chief Revanth Reddy Fired on CM KCR
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆసిఫాబాద్ నియోజక వర్గంకు చెందిన టీఆర్‌ఎస్ నాయకురాలు సరస్వతి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్. పాలనలో నాలుగు కోట్ల జనం దగా పడ్డారని, కేసీఆర్ కుటుంబం మాత్రమే విద్యార్థుల పోరాటతో లబ్ది పొందుతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణను దోచుకుంటున్నది కేసీఆర్ కుటుంబమని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, మోడీ పదవి కాంక్షతో తెలంగాణ ను వ్యతిరేకించారన్నారు. అలాంటి బీజేపీ కోసం ఇవ్వలేదని, పేదల బాగుకోసం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహాల్లో రాష్ట్రం చిక్కుకుందని, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలను నిలదీస్తుందన్నారు.
కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను నట్టేట ముంచుతున్నాయని, గోదావరి పరివాహక ప్రాంతం వరదల్లో అంతా నష్టపోయిందని, వరద బాధితులను ఆదుకోవాలని పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు.. వారం రోజులు ఉండి ఏం చేశారు. గాడిద పండ్లు తోమాడా.. సమస్యలు గాలికి వదిలేశారు. కొడుకు.. కాలు జారిండ.. ఇంట్లో హోమ్ థియేటర్ లో కూర్చున్నాడు.. కేసీఆర్ ఢిల్లిలో కూర్చున్నాడు.. చికోటీ వ్యవహారం లో చీకటి మిత్రుడు ఎవరో బయటకు రావాలి. ఓ మంత్రి స్టిక్కర్ ఎవరో దొంగతనం చేశారు అంటారు. ఎమ్మెల్యేలు… మంత్రులు ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గుట్కా..మట్కా లేదు అని కేసీఆర్ అంటున్నారు.
హవాలాలో మీ మంత్రులు అంట కాగుతున్నరు అంటూ ఆయన విమర్శించారు.