ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయని గమనించాలి. నవంబర్ లో మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో ప్రభుత్వ సెలవులు, అలాగే రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవు రోజుల్లో కూడా ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
Also Read:Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం..
నవంబర్ లో బ్యాంకు సెలవుల జాబితా
నవంబర్ 1 (శనివారం): కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో సెలవు. అలాగే ఉత్తరాఖండ్‌లో ఇగాస్- బగ్వాల్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 2: ఆదివారం
నవరంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా పలు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 7 (శుక్రవారం): మేఘాలయాలో వంగల పండగ. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవులు.
నవంబర్ 8 (శనివారం) : రెండో శనివారం
నవంబర్ 9: ఆదివారం
నవంబర్ 11 (మంగళవారం): లహాబ్ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
నవరంబర్ 16: ఆదివారం
నవంబర్ 22: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 23 : ఆదివారం
నవంబర్ 25: (మంగళవారం): గురు తేజ్ బహదూర్ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హర్యానాతోపాటు ఛండీగఢ్‌లోని బ్యాంకులన్నింటికి సెలవు.
నవంబర్ 30: ఆదివారం
Also Read:Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత..