బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు.