Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 30 01 2025

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :January 30, 2025 , 9:14 pm
By Gogikar Sai Krishna
  • బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్.. ముందు అమెరికా, ఇప్పుడు స్విట్జర్లాండ్..
  • పేదల పెద్ద దవాఖానాకు ఏర్పాట్లు పూర్తి.. రేపు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
  • ఏపీలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ.. సర్క్యూలర్ జారీ
  • వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ.. ఫిబ్రవరి 5న ఆందోళనకు పిలుపు
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ..

కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Also Read

  • M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
  • Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!
  • Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నిర్మలమ్మ బడ్జెట్‌లో ఈ రాష్ట్రాలకు తాయిలాలు ఉండే ఛాన్స్!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాలు నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే ధరల తగ్గింపుపై ఏమైనా శుభవార్త అందుతుందేమోనని సామాన్య ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని రకాల ప్రజలు బడ్జెట్ కోసం నిరీక్షిస్తున్నారు.

వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ.. ఫిబ్రవరి 5న ఆందోళనకు పిలుపు

తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో వైసీపీ ‘ఫీజు పోరు’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయక పోవడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది.

హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నిన్నటి దాకా యమునా నీళ్లపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజాగా రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ‘చెత్త’ రాజకీయానికి తెరలేపారు. వికాస్‌పురిలో ఉన్న చెత్తను మూడు ట్రక్కుల్లో నింపి.. ఫిరోజ్‌షా రోడ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇంటి ముందు వేసి నిరసన తెలిపింది. తన సహచర బృందంతో ఈ కార్యక్రమానికి పూనుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్వాతి మాలివాల్‌ను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రభుత్వ పాఠశాల్లో AI ఆధారిత డిజిటల్ విద్య.. సర్కార్ కీలక నిర్ణయం

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో పాఠశాల విద్యను మరింత నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి గాను ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ( ఏ.ఐ ), డిజిటల్ ఇనీషియేటివ్స్ లను పాఠశాల విద్య శాఖ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. విద్యార్థులలో మరింత మెరుగైన అభ్యాస పద్దతులను, సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టనున్నారు.

ఏపీలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ.. సర్క్యూలర్ జారీ

ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఎల్లుండి (శనివారం) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తగ్గుదల.. కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా.. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు ఇచ్చారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలి..

తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్‌ఎంసీ పాలిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ బాధేంటో నాకు తెలుసు అని, పాత కాంట్రాక్టర్లకే బిల్లులు రాకపోతే కొత్త కాంట్రాక్టర్లు ఎలా వస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుందని, పేదల్లో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నచోటనే గొప్ప హాస్పిటల్ గా కట్టొచ్చన్నారు.

బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్.. ముందు అమెరికా, ఇప్పుడు స్విట్జర్లాండ్..

మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్‌ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది. యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బంగ్లాలో దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి, మరోవైపు విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి.

పేదల పెద్ద దవాఖానాకు ఏర్పాట్లు పూర్తి.. రేపు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్ర‌లో మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రికి నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రి అఫ్జ‌ల్ గంజ్‌లో ఉండ‌గా.. నూత‌న ఆసుప‌త్రిని గోషామ‌హ‌ల్ స్టేడియంలో నిర్మించ‌నున్నారు. నూత‌న ఆసుప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం భూమి పూజ చేయ‌నున్నారు. 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో మొత్తం 32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నూత‌న ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు. 26 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ‌నున్న ఈ నూతన ఆసుప‌త్రిని కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా నిర్మించాల‌ని ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది.. కేజ్రీవాల్ ఆరోపణలు

ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి ఢీకొంటున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. కాంగ్రెస్ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీని గెలిపించేందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • CM Revanth Reddy
  • kejriwal
  • Nirmala Sitharaman
  • telugu news

తాజావార్తలు

  • M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్

  • Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!

  • Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!

  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!

  • Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions