వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్రాంతికి గంగి రెద్దులు వచ్చినట్టు కాంగ్రెస్, బీజెపీ వాళ్ళు ఓట్ల కోసం వస్తారన్నారు. కాంగ్రెస్, బీజెపీ, బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ, వ్యక్తుల మధ్య పోటీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆరున్నర ఏళ్లు మాత్రమే బీఆర్ఎస్ పని చేసిందని, తెలంగాణ రాక ముందు 55 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సెస్ వాళ్ళను కరెంట్ కోసం బ్రతిమిలాడమని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం పొలాల వద్ద ప్రతి రాత్రి జగరనేనన్నారు మంత్రి కేటీఆర్.
నాకు పదవులు అవసరం లేదు.. జిల్లా అభివృద్ధి కోసమే బరిలో ఉన్నా
ఖమ్మం జిల్లా ఎస్ఆర్ కన్వెన్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నాకు రాజకీయ జన్మ ఇచ్చిన పూజ్యులు ఎన్టీఆర్ అని, రాష్ట్ర విభజనతో ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో అవమానాలు ఎదురైనా తెలుగుదేశంలోనే ఉన్నానన్నారు. మార్చి 29న దేవుడు ఎన్టీఆర్ పెట్టిన ముహూర్తం ఆ దేవుడు కూడా మార్చలేడని, గోదావరి జలాల తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయాలనేది నా ఆశయమన్నారు. చిన్న వయస్సులో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని, నా రాజకీయ లక్ష్యం పూజ్యులు ఎన్టీఆర్ బాటలో రైతాంగం కోసం పనిచేయడమన్నారు తుమ్మల.
నాసా కోసం స్నేక్ రోబోట్.. ఇండియన్ సైంటిస్ట్ ఘటన..
నాసా.. అమెరికా అంతరిక్ష సంస్థ. ప్రస్తుతం అనేక దేశాలతో పోలిస్తే నాసా అంతరిక్ష ప్రయోగాల్లో ముందుంది. ఆర్టిమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపైకి మానవుడిని పంపించేందుకు సిద్ధమౌతోంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అంగారకుడి పైకి కూడా మానవ సహిత యాత్రలను నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు నాసాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు భారత్‌కి చెందిన వారితో పాటు, ఇండో-అమెరికన్లు చాలా మందే ఉన్నారు. భారత శాస్త్రవేత్తలకు ఎప్పుడూ కూడా నాసా రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంది. టాలెంట్ ఉన్న సైంటిస్టులకు ఆకర్షణీయమైన అవకాశాలు అందిస్తోంది.
తాజాగా చంద్రుడు, అంగారకుడిపై అన్వేషించడానికి, తనంతట తానే పనిచేసే స్వయంప్రతిపత్తి కలిగిన పామును పోలి ఉన్న ఓ రోజును నాసా పరీక్షిస్తోంది. కొండ చిలువ ఆకారంలో ఉన్న ఈ రోబో భవిష్యత్తులో లూనార్, మార్స్ ఉపరితలాలపై అణ్వేషణల కోసం పంపే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది…
తెలంగాణలో ఎన్నికలు వేడెక్కాయి. ఆయా పార్టీలు ప్రచారాలు జోరుగా సాగిస్తున్నాయి. ఇవాళ నిర్మల్‌లో ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించి బొందపెట్టడానికి వేలాదిగా తరలి వచ్చిన మీకు అభినందనలు అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు చెప్పిన.. ఈనాడు చెబుతున్నా.. కొడంగల్ లాగే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండని, మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైందన్నారు రేవంత్ రెడ్డి.
విరాట్ కోహ్లీకి అభినందనల వెల్లువ.. ప్రధాని మోడీ, సచిన్ ట్వీట్స్..
కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు. 113 బంతుల్లో 117 రన్స్ సాధించాడు. ఈ ఘనత సాధించినందుకు విరాట్ కోహ్లీని ప్రధాని నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షాతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఈ మేరకు వారు ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, 50వ సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విరాట్ కోహ్లీ తన 50 సెంచరీని సాధించమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి నిర్వచించే పట్టుదలకు ఉదాహరణగా నిలిచారు. ఈ అద్బుతమైన మైలురాయి, అతని నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం. నేను అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అతను భవిష్యత్ తరాలకు బెంచ్‌మార్క్ సెట్ చేస్తూనే ఉన్నాడు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే రామ మందిరాన్ని నిర్మించేవారా..?
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో రాముడి ఆలయం వచ్చేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున యోగి ప్రచారం చేశారు. ఎంపీలోని పావై, అశోక్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యంలో భారీ ఆలయ నిర్మాణం పూర్తవుతోందని యోగి అన్నారు. బీజేపీ పాలనలో ప్రకృతి వైపరీత్యం తర్వాత కేదార్‌నాథ్ ధామ్, ఉజ్జయినిలోని మహాకాల్ లోక్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయాలను పునరుద్ధరించామని యూపీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పని చేయనప్పుడు వారిని ప్రజలు ఎందుకు భరించాలని అడిగారు. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే రామమందిరం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.
పాక్ టీంకు షాక్.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బాబర్ ఆజమ్..
ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ మాజీ క్రికెటర్లు ప్లేయర్లను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాల నేపథ్యంలో, బుధవారం అన్ని పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ నుంచి వైదొగులుతున్నట్లు బాబార్ ఆజమ్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్నాడు.
కెప్టెన్సీ ఒక కారణమైతే.. ఈ మేజర్ టోర్నీలో బాబర్ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోవడం కూడా పాక్ అభిమానులకు మింగుడుపడటం లేదు. టోర్నీలోని 9 మ్యాచుల్లో బాబార్ 320 పరుగులు మాత్రమే చేశాడు. తదుపరి కెప్టెన్సీ బాధ్యతలను షహీన్ ఆఫ్రిదికి దక్కే అవకాశాలు ఉన్నాయి.
పేదవాడు ఆకలి పోయి.. ఆనందంగా తిరిగితే అది అభివృద్ధి కాదా?
జగన్ జైత్ర యాత్రను ఆపే శక్తి ఎవరికి లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవాడు ఆకలితో చస్తుంటే… రోడ్లు వేసి అభివృద్ది అంటే ఎలా అని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అని పేర్కొన్నారు. జీడీపీ డబుల్ డిజిట్స్‌కి వెళ్లిందన్నారు. క్వాలిటేటివ్ లైఫ్ పెరిగిందని.. పేదవాడు ఆకలి పోయి.. ఆనందంగా తిరిగితే అది అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. విద్యను ప్రోత్సహిస్తుంటే అది అభివృద్ధి కాదా అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో సీట్ల కోసం రికమేండేషన్ చేయమని వస్తున్నారన్నారు.
కులం, మతం, రంగు లేదు… అర్హతే ప్రామాణికంగా పథకాలు అందజేస్తున్నామన్నారు. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారని.. ప్రజల నుంచి వచ్చిన డబ్బు ప్రజలకే ఇస్తున్నారన్నారు. రైతుకు ఇప్పటి వరకు ఆఫీస్ లేదు.. జగన్ రైతుల కోసం రైతుభరోసా కేంద్రం కట్టి.. ఇది మీ కార్యాలయం అని చూపించారన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఏం చేశాడని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వడం మానేసి.. స్కిల్ స్కాం చేశాడని మండిపడ్డారు. వందల ఎకరాలు కబ్జా చేసి.. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారన్నారు. ఆంధ్రాను ఆలీ బాబా నలబై దొంగల్లా రాష్ట్రం మొత్తాన్ని టీడీపీ నేతలు, చంద్రబాబు లూటీ చేశారని విమర్శించారు. సామాజిక దామాషా పద్దతిలో చంద్రబాబు పదవులే ఇవ్వలేదన్నారు. జగన్ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.
పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తాం
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటలకు హారతులతో స్వాగతం పలికారు గ్రామస్థులు. వీరతిలకం దిద్దారు మహిళలు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో నన్ను కేసీఆర్ చాపను రాకినట్టు రాకిండు. నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేను. ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉందన్నారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని, కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఈటల. బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మోదీ గారు హామీ ఇచ్చారు. దీన్ని తెలంగాణ అంతా అందిపుచ్చుకోవాలి. మొత్తం తెలంగాణ ఓట్లు వేస్తేనే బీసీ సీఎం సాధ్యం అవుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు ఈటల రాజేందర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సామాజిక న్యాయం గురించి చంద్రబాబు, పవన్‌లు మాట్లాడలేదు..
మూడు ప్రాంతాలనుండి మూడు సామాజిక రథాలు ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న కటౌట్ పెట్టి బస్ యాత్ర చేస్తేనే గ్రామాలు, పట్టణాలు, జన సంద్రంగా మారుతున్నాయన్నారు. సైకిల్‌కి తుప్పు పట్టిందని, గ్లాసు పగిలిపోయిందని మంత్రి పేర్కొ్న్నారు. పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. చంద్రబాబు జైలు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడన్నారు. సామాజిక న్యాయం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదన్నారు.
ఈ రాష్ట్రం నుంచి నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభ సభ్యులను చేసింది సీఎం జగన్ అంటూ మంత్రి జోగి రమేష్ తెలిపారు. స్పీకర్, ఛైర్మన్ స్థానాలలో వెనుకబడిన వారిని కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే,.. పవన్ కళ్యాణ్ చెంచా నాదెండ్ల మనోహర్ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పు అంటున్నాడని మండిపడ్డారు. పేదవారిపై వీరంతా కక్ష కట్టారన్నారు. ప్రభుత్వం చేస్తుంది తప్పో కాదో ప్రజలే చెప్పాలన్నారు.
