Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps Fuel-Efficient Routes: ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో జనాలు మైలేజ్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇక మైలేజ్ పెంచడం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా ఇంధనాన్ని ఆదా చేయవచ్చనే విషయం చాలామందికి తెలియదు. అవును, మనం రోజువారీగా ఉపయోగించే ‘గూగుల్ మ్యాప్స్’ (Google Maps) లో ఉండే ఒక చిన్న సెట్టింగ్‌తో మీ ఇంధనం ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనం గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా లొకేషన్ సెట్ చేసినప్పుడు, అది కేవలం అత్యంత వేగంగా లేదా తక్కువ దూరంలో గమ్యస్థానానికి చేర్చే రూట్‌ను మాత్రమే చూపిస్తుంది. అయితే, దూరం తక్కువగా ఉన్న ప్రతి రూట్ మనకు ఇంధనాన్ని ఆదా చేస్తుందని చెప్పలేం. కొన్ని చిన్న దారుల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉండొచ్చు, లేదా ఎత్తుపల్లాలు, ఎక్కువ మలుపులు ఉండొచ్చు. దీనివల్ల పదే పదే బ్రేకులు వేస్తూ, మళ్లీ యాక్సిలరేటర్ నొక్కాల్సి వస్తుంది. ఇలాంటి డ్రైవింగ్ వల్ల ఇంజిన్‌పై లోడ్ పడి ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది.
ఇలాంటి పరిస్థితి నుంచి వాహనదారులను రక్షించడానికే గూగుల్ మ్యాప్స్‌లో ‘ఫ్యూయల్-ఎఫిషియంట్ రూట్స్’ (Fuel-efficient routes) అనే అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే, గూగుల్ మ్యాప్స్ మీకు కేవలం దూరాన్ని మాత్రమే కాకుండా, ఏ రూట్లో వెళ్తే తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చవుతుందో లెక్కగట్టి మరీ రూట్‌ను చూపిస్తుంది. అంటే ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువగా ఉండి, వాహనం ఆపకుండా స్మూత్‌గా వెళ్లే అవకాశం ఉంటుందో ఆ దారినే ఇది మీకు సూచిస్తుంది. డ్రైవింగ్ ఎంత స్మూత్‌గా సాగితే మైలేజ్ అంత బాగా వస్తుందనే సూత్రంపైనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీన్ని యాక్టివేట్ చేయడం కూడా చాలా సులభం. మీ ఫోన్ లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ లోకి వెళ్లాలి. అందులో ‘నావిగేషన్ సెట్టింగ్స్’ (Navigation settings) ఆప్షన్‌ను ఎంచుకుని, అక్కడ కనిపించే ‘Prefer fuel-efficient routes’ అనే ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
Also Read
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
ఉదాహరణకు.. మీ ఆఫీస్ మీ ఇంటికి 10 కిలోమీటర్ల దూరం ఉందనుకుందాం.. మీరు ఎప్పుడూ ఒకే రూట్లో ఆఫీస్‌లు వెళ్తారు. ఆ దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వాహనం ఎక్కువసేపు ఆగుతూ, నెమ్మదిగా వెళ్తుంది. దీనివల్ల పెట్రోల్ త్వరగా అయిపోతుంది. అదే గూగుల్ మ్యాప్స్ చూపించే ఫ్యూయల్-ఎఫిషియంట్ రూట్ ఒక అర కిలోమీటరో లేదా కిలోమీటరో ఎక్కువ దూరం చూయించినప్పటికీ.. అక్కడ ట్రాఫిక్ లేకపోవడం వల్ల బ్రేకులు వేయకుండా బండి సాఫీగా సాగిపోతుంది. ఫలితంగా దూరం కొంచెం పెరిగినా, ఇంధన వినియోగం మాత్రం చాలా వరకు తగ్గుతుంది. ఈ ఫీచర్‌లోని మరో విశేషం ఏంటంటే.. ఇది మీ వాహన రకాన్ని బట్టి రూట్‌ను డిజైన్ చేస్తుంది. మీది పెట్రోల్ వాహనమా, డీజిల్ బండా లేదా హైబ్రిడ్ కారా అనే వివరాలను యాప్‌లో ఇస్తే, ఆయా ఇంజిన్ల పనితీరు, ఇంధన వినియోగ సామర్థ్యానికి అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ మీకు బెస్ట్ రూట్‌ను సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కో రకమైన ఇంజిన్ వేర్వేరు వేగాల వద్ద, వేర్వేరు ట్రాఫిక్ పరిస్థితుల్లో భిన్నంగా మైలేజ్ ఇస్తుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?