శ్రీలంకను వణికించిన శక్తివంతమైన భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ద్వీప దేశం శ్రీలంకను భూకంపం వణికించింది. శ్రీలంక రాజధాని కొలోంబోలో భూమి శక్తవంతమైన ప్రకంపనలు సృష్టించింది. దీంతో శ్రీలంక ప్రజలు భయంతో పరుగుల తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు రిపోర్టు అందలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సమాచారం మేరకు భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. ఇది అత్యంత శక్తవంతమైన భూకంపంగా అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు ఆగ్నేయదిశగా 1,326 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కడియం శ్రీహరి, రాజయ్యలు ఇద్దరూ శ్రీకృష్ణులే…
స్టేషన్ ఘన్‌పూర్‌లో నేడు కాంగ్రెస్ విజయ భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి, రాజయ్య లు ఇద్దరు శ్రీకృష్ణులే అని ఆయన అన్నారు. మీ చెల్లే సుభద్ర ను గెలిపించాల్సిన బాధ్యత మీదే అని ఆయన అన్నారు. దోచుకున్న సొమ్ముతో దొంగలు మళ్లీ మీ ముందుకు వస్తున్నారని, ప్రజల్ని దోచుకునేది బిఆర్ఎస్ అయితే… ప్రజలను కాపాడుకునేది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రవళిక చనిపోతే పరామర్శించడం చేతకాదు కానీ… కాంగ్రెస్ నుండి అలిగిన పొన్నాల లక్ష్మయ్యను పరామర్శించడం తెలుసు అని ఆయన అన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు.. ఉద్యోగులకు ప్రమోషన్లు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇవ్వడమే కాకుండా, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు అద్దంకి దయాకర్ రావు.
మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్.. కొత్త వేరియంట్ కలకలం
2020లో కొవిడ్ ఎంతటి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల పాటు ప్రపంచాన్నే చెడుగుడు ఆడుకున్న కరోనా.. మళ్లీ కోరలు చాస్తుంది. అయితే అందరూ ఇక కరోనా అంతమైపోయిందనుకున్నప్పటికీ.. మరో కొత్తరకం వేరియంట్ కలవరపెడుతుంది. జేఎన్ 1 రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్ కు కారణమవడమే కాకుండా.. ప్రస్తుతమున్న టీకాలేవీ పనిచేయవని అంటున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ పై ఆందోళన చెందుతున్నారు. జేఎన్ 1 వైరస్ రకాన్ని మూడు నెలల క్రితం లగ్జెంబర్గ్ లో తొలిసారిగా గుర్తించారు.
ఈ వైరస్ అక్కడి నుంచి ఇంగ్లాండ్, ఐస్ ల్యాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ ఎక్స్ బీబీ 1.5, హెచ్ వీ.1 వంటి కోవిడ్ వైరస్ రకాలకు చెందినదే అయినా దీనిలో చాలా తేడాలు ఉన్నాయి. ఎక్స్ బీబీ 1.5 రకం వైరస్ ముల్లు ప్రోటీన్ మీద 41 మార్పులు సంభవించి, ఈ స్థితికి చేరుకుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు దీన్ని నిలువరించలేవని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. దీని నుంచి కాపాడుకోవడానికి ఆధునీకరించిన కొవిడ్ టీకాలు అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ చెబుతోంది.
2014 వరకు చాలా జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 వరకు చాలా జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లేవారని, 24గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకుంటా అన్నారు జానారెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. 24గంటల కరెంట్ ఇచ్చి నేను మాట నిలబెట్టుకున్న అని, జానారెడ్డి మాత్రం మాట నిలబెట్టుకోలేదన్నారు సీఎం కేసీఆర్. జానారెడ్డి పంచరంగుల కల కంటున్నారు సీఎం అవుతా అని, సాగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ లను పూర్తి చేసి.. నేనే ప్రారంభిస్తానన్నారు సీఎం కేసీఆర్. నీటి తిరువా రద్దు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని, రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తేనే… రైతులకు రైతు బంధు వస్తుందని, 24గంటల కరెంట్ ఉండాలి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండాలన్నారు. ధరణి తీసేస్తే దళారి రాజ్యం వస్తుందని, సాగర్ లో 70 వేల మెజారిటీతో బి.ఆర్.ఎస్ అభ్యర్థి భగత్ గెలుస్తారన్నారు సీఎం కేసీఆర్.
ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు చెప్పులు గతి లేని వ్యక్తులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారన్నారు. ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారని, అడ్డుకోబోతే పోలీస్ బూట్లతో తన్నించారన్నారు రేవంత్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయలేదని, ఎన్నికలు వస్తున్నాయని తాత్కాలికంగా పక్కన పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రైతుల మెడ మీద కత్తిలా ఉందని, కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థులు త్యాగం చేస్తే ఇప్పుడు వాళ్ళను అణచివేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
ఏపీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు. బాబు సీఎంగా ఉన్న సమయంలో కరువు వస్తే , కరువు మండలాలు ప్రకటించి ఇన్‌పుట్ సబ్సిడీలు, పంట నష్టపరిహారం అందించామన్నారు. రైతును దగా చేయటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల తీరు చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారన్నారు. నాడు 2018 సంవత్సరంలో 275 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించామని.. నేడు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే , కేవలం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం చెయ్యి దులుపు కుంటుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో చేల్లని రూపాయి హుస్నాబాద్ లో చెల్లుద్దని పొన్నం వచ్చాడా అని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే బీఆర్ఎస్ లో నలుగురు సీఎం పదవి కోసం కొట్లాడుతారని, కాంగ్రెస్ లో 70 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీ చార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుండి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు.
గడప గడపకు ప్రచారంలో దూసుకుపోతున్న మనోహర్ రెడ్డి
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించారు. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి సార్లరావు పల్లి, సాయిరెడ్డి గూడ, ముచ్చర్ల, దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి, నేద్నుర్, మన్యే గూడ ప్రాంతాలలో పర్యటించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని.. కబ్జా ప్రభుత్వం అయిన బీఆర్‌ఎస్‌ను తొక్కుకుంటూ ఏనుగు అనూహ్యంగా దూసుకుపోతోందని మహేశ్వరం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి అన్నారు.
అవినీతి పరిపాలన, నీచమైన, దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదు…
ఇప్పుడు ఉన్నవాళ్లు అంత అప్పుడు బీఆర్ఎస్ నుండే గెలిచారన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఈరోజుకి కూడా ఒక్కసారి కూడా మేయర్ కి కూడా ఫోన్ చెయ్యలేదన్నారు. ఇలా అసభ్య భాషను ఎప్పుడు వాడలేదని, అవినీతి పరిపాలన, నీచమైన, దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదన్నారు తుమ్మల. వాళ్ళు తట్టుకోలేక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారన్నారు. డిప్యుటీ మేయర్ చాలా మంచి పని చేశారన్నారు తుమ్మల. ప్రజ అభిప్రాయం ఎట్ల ఉందొ మనం ఇప్పుడు చూస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ఈ పదిహేను రోజులు కష్టపడి పనిచేసి అరాచక పాలనను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తుమ్మల చెప్పారు.
నేను గజ్వేల్‌కి పోతే కేసీఆర్ కామారెడ్డికి పోయిండు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మామిండ్లవాడలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దమ్ముంటే నాపై పోటీ చెయ్ కానీ శిఖండిలా కొట్లాడకు అని ఆరోజే చెప్పిన అని అన్నారు. నేను గజ్వెల్ కి పోతే కెసిఆర్ కామారెడ్డికి పోయిండని, నేను గెలిచినా నన్ను కనీసం అసెంబ్లీ కి కూడా రానీయలేదన్నారు ఈటల రాజేందర్. గజ్వేల్ కి నువ్వు రావడం మా అదృష్టం అంటున్నారు అక్కడి ప్రజలు అని, హుజురాబాద్ నియోజకవర్గం కి నాకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తే తప్ప మునిసిపల్ గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని, తాగుడుమీద 45 వేలకోట్లు ప్రభుత్వం కి మనం ఇస్తున్నం మనకి పథకాల పేరుతోటి కేవలం 14 వేల కోట్లు ఇస్తున్నాడన్నారు.