తిరుమలలో చిక్కిన మరో చిరుత.. ఇక భయం తొలిగినట్టేనా..?
తిరుమల నడకదారిలో నరశింహస్వామి ఆలయం.. ఏడో మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవీశాఖ అధికారులు.. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.. అయితే, నాలుగు రోజుల క్రితమే అధికారులకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు.. వెంటనే బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. 4 రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దాని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేయగా.. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది. అయితే, తిరుమలలో ‘ఆపరేషన్ చిరుత’ కొనసాగుతుందని చెబుతున్నారు అధికారులు.. ఇప్పటి వరకు ఐదు చిక్కినా.. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నమాట.. అయితే, ఇప్పటికే ఐదు చిరుతలు చిక్కడంతో.. ఇక, నడకదారిలో పెద్దగా ఇబ్బందులు ఉండవనే చర్చ కూడా సాగుతోంది. కాగా, జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28 తేద్దీల్లో చిరుతను బంధించిన అటవీశాఖ అధికారులు.. తాజాగా అంటే సెప్టెంబర్ 6వ తేదీన ఐదో చిరుతను కూడా బంధించగలిగారు.
కన్న కొడుకుని చంపిన తల్లి.. సహకరించిన చెల్లి
విజయవాడలో సంచలనంగా మారిన ఓ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెడు అలవాట్లకు బానిసైపోయిన ఓ యువకుడు.. నిత్యం ఇంటికి వచ్చి తల్లిని వేధింపులకు గురిచేసేవాడు.. మద్యం, గంజాయికి బానిసగామారి.. డబ్బుల కోసం తల్లిని పీల్చుకుతినేవాడు.. అయితే, నిత్యం ఇదే తంతు కొనసాగుతుండడంతో.. కన్న కొడుకు అనే విషయాన్ని కూడా ఆ వేధింపులు మర్చిపోయేలా చేశాయి.. కాళికగా మారిన ఆ తల్లి.. కన్న కొడుకుని చంపేసింది.. ఈ ఘటనకు మృతుడి చెల్లి కూడా సహకరించింది.. అయితే, ఈ వ్యవహారం ఆలస్యంగా పోస్టు మార్టం నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది.. మద్యం, గంజాయి బానిసగా మారిన దేవ్ కుమార్ ను తల్లి మాధవి హత్య చేయగా.. ఆమె దేవ్‌కుమార్ చెల్లితో పాటు.. అలీఖాన్ అనే మరో వ్యక్తి సహకరించారు.. పీక నొక్కి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు.. అయితే, తాము పనికి వెళ్లి వచ్చే సరికి చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి.. మొదట అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. దర్యాప్తులో హత్యగా గుర్తించారు పోలీసులు. మృతుడి తల్లి, చెల్లి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
మా పై విమర్శలు చేసినా భక్తుల భద్రతపై రాజీపడం..
తిరుమలకు నడకదారిలో వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది.. అయితే, భక్తుల భద్రతే మత ధ్యేయంగా చర్యలకు పూనుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆపరేషన్ చిరుత ప్రారంభించింది.. ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించింది. మరోవైపు.. నడకదారిలో వెళ్లే భక్తులకు ఊతకర్రలను పంపిణీ చేస్తోంది.. అయితే, ఈ నిర్ణయం తర్వాత టీటీడీపై విమర్శలు పెరిగాయి.. అయితే, ఐదో చిరుత చిక్కిన ప్రాంతాన్ని డీఎఫ్‌వో సతీష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి భక్తుల భధ్రతలో రాజీపడం అని స్పష్టం చేశారు.. రెండు సార్లు చిరుత దాడులు చేసిన నేపథ్యంలో ఐదు చిరుతలను బంధించామని వెల్లడించారు. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రకటించిన ఆయన.. 300 మంది అటవీ శాఖ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇక, ఊత కర్రల పంపిణీ విషయంలో వస్తున్న విమర్శలపై స్పందించిన టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి.. భక్తుల్లో భరోసా కల్పించడానికి ఈతకర్రలను పంపిణీ చేస్తున్నాం అన్నారు.. ఈతకర్రల నిర్ణయం తీసుకున్న తర్వాత నాలుగు చిరుతలను బంధించామని గుర్తుచేశారు. మా పై విమర్శలు చేసినా.. భక్తుల భధ్రతపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. మరోవైపు.. బోనులో చిక్కిన ఐదో చిరుతను క్వారంటైన్ కి తరలిస్తాం అని డీఎఫ్‌వో సతీష్ రెడ్డి వెల్లడించారు. దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు శాంప్లిల్స్ ని పంపాం..నివేదిక వచ్చిన తరువాత నిర్దారణ చేస్తామన్న ఆయన.. నడకదారి వైపున వన్యప్రాణుల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నారు. రోడ్డు, నడకమార్గంలో నిరంతరాయంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు డీఎఫ్‌వో సతీష్‌రెడ్డి.
పాకిస్తాన్ మమ్మల్ని బాగా చూసుకుంది: బీసీసీఐ అధ్యక్షుడు
పాకిస్థాన్‌లో లభించిన ఆప్యాయత, స్నేహపూర్వక ఆదరణ తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపాడు. రెండు దేశాల మధ్య క్రికెట్ ఆట వారధిగా నిలుస్తుందని బీసీసీఐ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను వీక్షించిన తర్వాత బిన్నీ, శుక్లా బుధవారం అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారు. గత 17 ఏళ్లలో ఇద్దరు బీసీసీఐ అధికారులు పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ‘పాకిస్తాన్‌లో మాకు మంచి ఆతిథ్యం లభించింది. వారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. క్రికెట్ మ్యాచులు చూడటం మరియు పాకిస్తాన్ బోర్డు అధికారులతో పలు విషయాలు చర్చించడమే ప్రధాన ఎజెండా. మొత్తంగా ఇది మంచి పర్యటన’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ‘పీసీబీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. భద్రత చాలా పటిష్టంగా ఉంది. ఏర్పాట్లు బాగున్నాయి. రెండు దేశాల మధ్య క్రికెట్ వారధిగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.
అభిమానులకు శుభవార్త.. మరో 4 లక్షల టికెట్లు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు శుభవార్త. ఫాన్స్ కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.comలో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ 2023 టికెట్లు పొందవచ్చు. సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి. అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్ https:///tickets.cricketworldcup.com నుంచి టికెట్లు కొనుగోలు చేయొచ్చు. మరో దశ టికెట్ల అమ్మకాలు ఎప్పుడుంటాయో త్వరలో చెబుతాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే 4 లక్షల టికెట్లలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్లు ఎన్నో మాత్రం బీసీసీఐ చెప్పలేదు. చాలా ఏళ్ల తర్వాత స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుండడంతో టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. టికెట్లు అమ్మకానికి ఉంచిన గంటల్లోనే ‘సోల్డ్ అవుట్’ అని కనిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర సంఘాలతో చర్చించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.
హల్దీరామ్‌లను కొనుగోలు చేసే ప్రసక్తే లేదన్న టాటా కంపెనీ
ఆహార పదార్థాల తయారీ సంస్థ హల్దీరామ్ కంపెనీలో 51శాతం వాటాను టాటా కంపెనీ కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు కంపెనీలు ఇదే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను టాటా కంపెనీ తోసిపుచ్చింది. ఇకపై టాటా గ్రూప్‌లో భాగం కాదని ప్రకటించింది. హల్దీరామ్ బ్రాండ్‌తో ఎలాంటి ఒప్పందం కోసం చర్చలు జరపడం లేదని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు స్పష్టం చేసింది. బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని టాటా వినియోగదారుని కోరగా, టాటా గ్రూప్ స్పందించింది. టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్స్యూమర్ భారతదేశ ఇంటి పేరు స్నాక్ బ్రాండ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందని రాయిటర్స్ వార్త పేర్కొంది. దీని తర్వాత, కంపెనీ షేర్లలో 3 శాతం వరకు పెరుగుదల కనిపించింది. తర్వాత బిఎస్, ఎన్‌ఎస్‌ఇలు లిస్టెడ్ కంపెనీల నిబంధనల ప్రకారం దీనిపై పరిస్థితిని స్పష్టం చేయాలని టాటా గ్రూపును కోరాయి. టాటా గ్రూప్, స్టాక్ మార్కెట్‌కు పంపిన సమాధానంలో హల్దీరామ్ బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టడానికి టాటా చర్చలకు సంబంధించి 6 సెప్టెంబర్ 2023 నాటి రాయిటర్స్ వార్తలలో చేసిన దావాతో కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. నివేదికలో వివరించిన ఏ చర్చలలోనూ కంపెనీ పాల్గొన లేదని తెలిపింది.
వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను తింటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..
బయట వర్షం పడుతుంటే ఏదైనా కారంగా, వేడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. మన దేశంలో వర్షాలు పడితే అందరు ఇలానే అనుకుంటారు.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు.. బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు,. ఘాటైన మసాలాలు ఇంకా ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయని వాటికి దూరంగా ఉండటం బెస్ట్ అని చెబుతున్నారు.. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. గుండె సమస్యలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువ అయ్యాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా.. పని చేయాలన్నా స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని చెప్పవచ్చు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తింటే హై కొలెస్ట్రాల్, హైబీపీ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయి.. వర్షాకాలంలో ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల నొప్పి నివారిణిగా పని చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటీస్, డయాబెటీస్ ఉన్న వారిలో స్పైసీ ఫుడ్ నొప్పిని తగ్గించేందుకు సహాయ పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి…
‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్.. ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’. సక్సెస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జవాన్ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా.. దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జవాన్ చిత్రం హిందీతో తెలుగు, తమిళ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం రాత్రి ముంబైలో స్పెషల్ షో పడింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్ మూవీ ఎలా ఉంది?, స్టోరీ ఏంటి?, నటీనటులు ఎలా చేశారు? అనే తదితర విషయాలు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. జవాన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందని, ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే, జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలు కొడుతుందని అని కామెంట్ చేస్తున్నారు. జవాన్ నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో.. జవాన్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇండస్ట్రీ హిట్ ‘పఠాన్’ తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను జవాన్ అందుకుందని ఫాన్స్ పేర్కొంటున్నారు. ‘యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. షారుఖ్ నటన అదుర్స్’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘అట్లీ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్, మాస్ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీశాడు’ అంటున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ.. ‘శెట్టి’స్ ఫన్ ట్రీట్ అంతే!
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‍లో తెరకెక్కిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. మన దగ్గర కూడా ప్రీమియర్ షోస్ పడ్డాయి. దాంతో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. సినిమా ‘సూపర్ హిట్’ అని చాలా మంది అంటున్నారు. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కామెడి వర్కౌట్ అయ్యింది. చూడాల్సిన సినిమా. అనుష్క అదరగొట్టింది’, ‘ఫస్టాఫ్ ఫన్.. సెకండాఫ్ ఎమోషనల్. అనుష్క ఎప్పటికీ రాణే’, ‘సినిమా షార్ట్ బ్లాక్ బస్టర్. నవీన్ పోలిశెట్టికి హ్యాట్రిక్ హిట్ పడింది.. మరోసారి నాచురల్ రాక్ స్టార్ అనిపించాడు’, ‘ఫస్టాఫ్ కామెడీగా ఉంది. సెంకడాఫ్ వెరీ ఎమోషనల్. మహేష్ బాబు బాగా తీశాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.