ఏపీలో నేటితో ముగియనున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. సీఈసీ నేటి కార్యక్రమాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగియనుంది.. ఈ నెల 8వ తేదీన విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడ చేరుకుంది.. ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది.. ఏపీ సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది.. దీంతో.. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటన ముగియనుంది.. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫేక్ ఓటర్లపై అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
నేడు ఏపీకి కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాకూర్.. వైఎస్ షర్మిల బాధ్యతలపై క్లారిటీ..!
నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్.. తాను ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారి విజయవాడకు రానున్నారు.. ఉదయం 11:30కు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఎంపీ మాణికం ఠాకూర్‌కు స్వాగతం పలకనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇక, మధ్యాహ్నం రెండు గంటలకు మాణికం ఠాకూర్ సమక్షంలో ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు చేరబోతున్నారు.. అనంతరం ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మాణికం ఠాకూర్, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడర్లు పాల్గొంటారు.. ఇక, సాయంత్రం 6 గంటకు ఠాకూర్, గిడుగు రుద్రరాజు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అయితే, తనకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పాక తొలిసారి ఏపీకి వస్తున్నారు మాణికం ఠాకూర్.. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. అంతేకాదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. ఈ మధ్యే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. తన తండ్రి వైఎస్ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే నాన్నా లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే, ఆమె కాంగ్రెస్‌లో చేరి.. ఆ తర్వాత ఢిల్లీలోనే ఉండే.. సోనియా, ఖర్గే.. ఇలా పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. కానీ, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.. ఇప్పుడు ఠాకూర్ పర్యటనలో షర్మిలకు అప్పగించే బాధ్యతలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న ఠాకూర్.. ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారనే.. నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారనే చర్చ సాగుతోంది. కాగా, వైఎస్ షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ ఆదినుంచి సాగుతూవస్తున్న విషయం విదితమే.
ప్రారంభోత్సవానికి సిద్ధమైన అంబేద్కర్ స్మృతి వనం.. అర్ధరాత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు
విజయవాడలో అత్యంత సుందరంగా నిర్మాణం అవుతోంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం.. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా.. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.. అయితే ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తు్నారు.. ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి.. తనిఖీల్లో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పాల్గొన్నారు.. అక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించి.. పెండింగ్‌లో ఉన్న మిగతా పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. భారత దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం మారుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి.. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు. అత్యంత సుందరంగా, దేశంలోని తెలుగు ప్రజలు అందరు గర్వపడేలా నిర్మాణం జరుగుతుందన్నారు. అంబేద్కర్ స్మృతి వనం పనులు చివరి దశకు వచ్చాయని.. జనవరి 19న ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతుందన్నారు. ఇప్పటికే స్మృతి వనం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.. మిగిలి ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా విగ్రహం ప్రాంగణంలో చేపడుతున్న పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం పర్యటక ప్రాంతంలో మారిపోతుందని తెలిపారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి.
నడ్డాతో బీజేపీ ప్రధాన కార్యదర్శుల సమావేశం.. రామమందిరం-లోక్‌సభ ఎన్నికలపై చర్చ
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రామమందిరం కోసం పార్టీ నిర్ణయించిన పనులను సమీక్షించారు. అలాగే అయోధ్యకు వెళ్లే బీజేపీ సీనియర్ నేతలు, ప్రధాన కార్యదర్శుల బృందానికి చేయాల్సిన పనులపై సూచనలిచ్చారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అయోధ్యకు వెళ్లి చేయాల్సిన పనులపై దశలవారీగా చర్చించారు. దీనితో పాటు నేటి సమావేశంలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తన సాధారణ మంత్రులందరికీ నిర్దిష్ట బాధ్యతలను కూడా అప్పగించారు. వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వినోద్ తావ్డేను జాయినింగ్ కమిటీకి అధిపతిగా నియమించారు. అంటే, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఇతర పార్టీలు లేదా కొత్త వ్యక్తులను బిజెపిలో చేర్చుకునే పనిని వినోద్ తావ్డే, అతని బృందం చేస్తుంది.
భారత్- మాల్దీవుల వివాదం.. పర్యాటకులను పంపాలని చైనాకు వినతి
ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చైనాలో తన ఐదు రోజుల అధికారిక పర్యటనలో ముయిజ్జూ ఫుజియాన్ ప్రావిన్స్‌లో ‘మాల్దీవులు బిజినెస్ ఫోరం’లో ప్రసంగిస్తూ.. చైనాను తమ మిత్రుడుగా అభివర్ణించాడు.. ఇక, 2014లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రారంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (BRI) ప్రాజెక్టుపై ముయిజ్జూ ప్రశంసించారు. మాల్దీవుల చరిత్రలో చూడని అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చైనా అందించిందన్నాడు. ఈ సందర్భంగా మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపాలని ఆయన డ్రాగన్ కంట్రీని కోరారు. ఇక, కరోనా కంటే ముందు చైనాకు చెందిన పర్యటకులు అత్యధిక సంఖ్యలో మాల్దీవులను సందర్శించేది.. తిరిగి మళ్లీ తమ పర్యటనలకు వేగవంతం చేయాలని చైనాను కోరుతున్నాను అని మహ్మద్ ముయిజ్జూ పేర్కొన్నారు.
అతి తక్కువ బడ్జెట్ లో వివో కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720×1,612 పిక్సెల్, 90Hz రిఫ్రెష్ రేట్, 840 nits బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్ ఆక్టా-కోర్ 7nm మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.. కెమెరాను చూస్తే సెల్ఫీ ప్రియులకు పండగే అని చెప్పాలి.. 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 15వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం..ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అందించారు…
అతడు ఓపెనర్‌గా వస్తే.. బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు!
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ఎండ్ కార్డు వేశాడు. దీంతో టెస్టుల్లో వార్నర్ వారుసుడు ఎవరు? అని క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మార్కస్ హారిస్, మాట్ రెన్‌షా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్ రేసులో ఉన్నారు. అయితే ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ సరైనోడు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను స్టీవ్ స్మిత్‌నే ప్రారంభించాలని, స్మిత్ ఓపెనర్‌గా వస్తే బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు అని అన్నాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో ‘అరౌండ్ ది వికెట్’ షోలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి అవకాశం ఇవ్వాలి. 12 నెలల్లో నంబర్ 1 టెస్ట్ ఓపెనర్ అవుతాడు. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు.. ఏ స్ధానంలో అయినా బాగా బ్యాటింగ్ చేస్తాడు. స్మిత్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. బంతిని చక్కగా గమనించి ఆడుతాడు. అయితే స్మిత్ కొన్నిసార్లు ఎల్‌బీడబ్ల్యు అవుతుంటాడు. ఎల్‌బీడబ్ల్యు కానీ బ్యాటర్ ఎవరుంటారు చెప్పండి’ అని ప్రశ్నించాడు.
విద్యార్థులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ఫ్రీ!
జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ను విద్యార్థులు ఉచితంగా చూసే అవకాశంను హెచ్‌సీఏ కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 6-12 తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించొచ్చని హెచ్‌సీఏ తెలిపింది. మ్యాచ్‌ను చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్‌లో స్టేడియానికి రావాలి. స్టేడియానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ హెచ్‌సీఏ ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. జనవరి 18లోగా ఆసక్తి ఉన్న స్కూల్ యాజమాన్యాలు హెచ్‌సీఏ సీఈవోకు ceo.hydca@gmail.com మెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదా స్టేడియంలో తెలియజేయాలని హెచ్‌సీఏ తెలిపింది.
నయనతారపై కేసు నమోదు..ఎందుకో తెలుసా?
లేడీ బాస్ నయనతార గురించి అందరికీ తెలుసు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో వరుస సినిమాల్లో నటించడంతో పాటుగా హీరోలతో సమానంగా అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా నయనే కావడం విశేషం.. ఇకపోతే ఈ మధ్య ఈ అమ్మడు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ.. ‘అన్న పూరణి’… ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదల సమయంలో చెన్నైలో వరదలు రావడం వల్ల ‘అన్న పూరణి’ మూవీపై ఎలాంటి టాక్ రాలేదు. ఇక తాజాగా ఈమూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.. అలాగే పలు వివాదాలను కూడా అందుకుంటుంది.. కాగా, ఈ సినిమాలో జీవితంలో ఒక లక్ష్యం.. పట్టుదల ఉంటే ఎలాంటి అవాంతరాలనైనా దాటుకుని అనుకున్నది సాధించవచ్చనే ఉద్దేశ్యంతో’ ఈ మూవీ తెరకెక్కించారు. కానీ, డైరెక్టర్ అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్లు అయింది. ఈ మూవీలో సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతిని అలా చూపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, లవ్ ను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్ఛారని గత కొన్ని రోజులుగా పెద్ద చర్చలు కూడా జరుగుతున్నాయి.. మాజీ శివసేన నేత రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నపూరణి సినిమాకు సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్, హీరోయిన్ నయనతార, అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇలా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు… మరి ఈ సినిమా వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి..