సైకో గా వెంకటేష్.. ఆసక్తి రేకెత్తిస్తున్న సైంధవ్ టీజర్..
వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. తాజాగా ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుది . గత సినిమాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్‌లో వెంకటేష్ అదరగొట్టాడు.ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. చంద్రప్రస్థ అనే టౌన్‌లో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ తో కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోకి టీజర్ తీసుకెళ్ళింది.వికాస్ అనే కరుడుగుట్టిన క్రిమినల్‌గా ఈ టీజర్‌లో నవాజుద్ధీన్ సిద్ధిఖీని చూపించారు దర్శకుడు శైలేష్ . తనకు అడ్డొచ్చిన వారందరికి దారుణంగా చంపేస్తూ నవాజుద్ధీన్ సిద్ధిఖీ కనిపించాడు. సైకోగా వెంకటేష్ ఎంట్రీ టీజర్‌లో హైలైట్ గా నిలుస్తుంది.. ఓ సారి కత్తి, మరోసారి గన్ పడుతూ వెంకీని ఎంతో పవర్‌ఫుల్‌గా టీజర్‌లో ఆవిష్కరించారు.
ప్రధాని మణిపూర్ కన్నా ఇజ్రాయిల్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో సోమవారం పర్యటించారు. ఇజ్రాయిల్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని, భారత ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి కనబరచడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ జూన్ నెలలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించడాన్ని ప్రస్తావించారు. అక్కడి చూసిన సంఘటనల్ని నమ్మలేకపోతున్నానని, మణిపూర్ ఆలోచనల్ని బీజేపీ నాశనం చేసిందని, ఇప్పడు మణిపూర్ ఒక రాష్ట్రం కాదని, రెండు రాష్ట్రాలని.. మైయిటీ, కుకీ తెగల మధ్య కొనసాగతున్న సంఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు హత్యలకు గురైనా, మహిళలు వేధింపులకు గురైనా, పసిపిల్లలు చంపబడినా.. ప్రధానికి అక్కడికి వెళ్లడం ముఖ్యం కాదని భావిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆఫ్ఘాన్ స్టార్ క్రికెటర్
నిన్న జరిగిన ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో అతను భారత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు ఆఫ్ఘనిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. అంతేకాకుండా ‘ఢిల్లీ ప్రజలు మంచి హృదయం కలవారని.. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరు తమకు మద్దతు ఇచ్చినందుకు, ఆట జరిగినంత సేపు తమ జట్టును ఉత్సాహపరిచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. వారి ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మద్దతుదారులకు చాలా ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో తెలిపాడు.
వేముల వీరేశం రాకతో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలోని హోటల్ వివేరా లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో 200 మంది బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వేముల వీరేశం రాకతో కాంగ్రెస్ పార్టీ కి బలం చేకూరిందన్నారు. కేసీఆర్ లాగా మాకు పిట్టకథలు చెప్పి ప్రజలను మాయ చేయరాదని, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంను ఇచ్చిందన్నారు.
కేసీఆర్ కు మస్తి ఎక్కి కాంగ్రెస్ పార్టీ నీ బేకర్ పార్టీ అంటుండని, 45 రోజుల తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేయాలి కేసీఆర్ అంటూ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మహిళా ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురి చేశాడు నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య అని, ఒక్క ఓటుకు 5 వేలు డబ్బులు ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ఇచ్చిన డబ్బులు తీసుకోనీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ కే వేయాలని వెంకట్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లలో గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హమాస్ చెరలో 199 మంది బందీలు.. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటన..
అక్టోబర్ 7 నాడు ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఇజ్రాయిల్ మరిచిపోలేకపోతోంది. ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి దాడిని ఎప్పుడూ చూడలేదు. మెస్సాద్ వంటి గూఢాచర సంస్థ, పటిష్ట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ దాడిని ముందుగా పసిగట్టలేకపోయింది. 20 నిమిషాల వ్యవధిలోనే గాజా ప్రాంతం నుంచి హమాస్ ఉగ్రవాదులు 5000 రాకెట్లను ఫైర్ చేశారు. ఇదే కాకుండా ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికిన వాళ్లను దొరికినట్లు కాల్చి చంపేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పసిపిల్లల్ని తలలు నరికి చంపారు.
మరోవైపు ఇజ్రాయిల్ నుంచి పలువురిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిని విడిపించేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్లాన్ చేస్తోంది. మొత్తం 199 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. అంతకుముందు 155 మంది బందీలుగా ఉన్నారని అనుకున్నప్పటికీ.. మరింత విచారణ చేయగా 199గా తేలింది.
ఓ అభిమానిపై మిస్టర్ 360 ఫైర్..’నాకు ఆదేశాలు ఇవ్వొద్దు…’ అంటూ మండిపాటు
సూర్యకుమార్ యాదవ్ అంటే గ్రౌండ్ లో ఉన్నంత సేపు బాల్ ఎటు పోతుందో అన్నట్లు ఆడటం తన స్టైల్. అందుకే తనను అభిమానులు మిస్టర్ 360 అని కూడా అంటారు. అయితే వరల్డ్ కప్ 2023లో ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం సంపాదించుకున్న మాట వాస్తవమే కానీ.. ఇంతవరకు ఏ మ్యాచ్ ల్లో అతను ఆడలేదు. జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉండటం వల్ల తనకు అవకాశాలు లభించడం లేదు. అయితే సూర్య డగౌట్ లో కూర్చుని ఏదో తింటున్న వీడియో సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అయ్యింది.
ఆ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ కామెంట్ చేశాడు. “సార్, మీరు డగౌట్‌లో కూర్చుని ఏమి తింటున్నారు, గ్రౌండ్‌కి వెళ్లి సిక్స్‌లు కొట్టండి” అని రాశాడు. అయితే దానికి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “నేనేమీ తింటే మీకేందుకు.. మీకు కావాలంటే దయచేసి స్విగ్గీకి ఆర్డర్ ఇవ్వండి బ్రదర్” అని రాశాడు. అయితే సూర్య సమాధానానికి అభిమానులు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. మీమ్‌ను భాగస్వామ్యం చేస్తున్నప్పుడు, ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, “సర్, మీరు మాత్రమే ఈ ఆర్డర్‌ని పూర్తి చేయగలరు, స్విగ్గీ కాదు.” అలాగే సూర్య సమాధానంపై కూడా చాలా మంది స్పందించారు.
తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అని, కార్యకర్తల భరోసా కోసం అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తులు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్నారు. ఈ కార్యాలయం కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా కార్యక్రమాలు చేయాలని జిల్లా పార్టీ నాయకత్వానికి సూచించారు మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాలను నిర్మిస్తామని, ఎన్నికలు 5 ఏళ్లకో సారి వస్తయ్.పోతాయ్.. 50 ఏళ్లలో రైతు బంధు వంటి కార్యక్రమాలు రూపొందించింది కేసీఆర్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కేటీఆర్ వాదన
కేసీఆర్ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ప్రవలిక పరువు తీసేందుకు పోలీస్ ను వాడుకుంటున్నారని, ప్రజలు అమాయకులు కాదన్నారు లక్ష్మణ్. ఎన్నికలు అయినా కాకున్నా శాంతి భద్రతలు కాపాడేది రాష్ట్ర సర్కారు బాధ్యత ఎన్నికల సంఘంది కాదరన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కేటీఆర్ వాదన అని, ఎన్నికల నిర్వహణ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్య కు వేరే కారణం ఉందంటే నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, లీకేజీలతో 30 లక్షల మందిని మోసం చేశారన్నారు. ప్రవలిక గ్రూప్ 4 రాసి గ్రూప్ 1, 2 కోసం ప్రిపేర్ అవుతున్న విషయం కేటీఆర్ దాస్తే దాగేది కాదని, మీ చేతగాని తనం కోసం చనిపోయిన అమాయక అమ్మాయి మీద నెపం నెట్టడం మరింత దారుణమన్నారు.
చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తాం
జనగామ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించారు. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అయితే.. ఈ సభలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పొన్నాల లక్ష్మయ్యకు సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జనగామ, భువనగిరి గ్రోత్ కారిడార్‌లుగా మారాయి. పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే తాలూక జనగామ అని, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతారు. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా, జనగామలో మాత్రం రాదు. గులాబీ జెండా ఎగరగానే చంద్రబాబు వెళ్లి దేవాదులకు శంకుస్థాపన చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రం వచ్చాక మూడు నాలుగు నెలలు మేథోమధనం చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలు చేశాం. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది. కరెంట్ కష్టాలు లేవు, నీటి కొరత లేదు, పుట్లకొద్ది పంటలు పడుతున్నాయి. భూమిపై రైతుల హక్కులు వారికే ఉండాలి.
“ఆ గుండె చప్పుడును మేం ఆపలేం”.. గర్భవిచ్ఛత్తిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
26 వారాల గర్భాన్ని తొలగించాలన్న వివాహిత అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ఇచ్చిన నివేదిక ఆధారంగా.. గర్భాన్ని తొలగించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. గర్భంలో ఉన్న శిశువుకు ఎలాంటి సమస్యలు లేవని పేర్కొంది. ‘‘గర్భధారణ 26 వారాల 5 రోజులు. గర్భం రద్దుకు అనుమతించడం అనేది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్లు 3,5 ఉల్లంఘించడమే అవుతుందని, తల్లికి కానీ, పిల్లాడికి కానీ ఎలాంటి సమస్యలు లేవని’’ సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.
‘‘మనం ఇప్పుడు గుండె చప్పుడు ఆపలేము’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం వివాహిత స్త్రీలు, అత్యాచారాల నుంచి బయటపడిన వారు, ఇతర సమస్యలు ఉన్న మహిళలు, వికలాంగులు, మైనర్ల వంటి వారిలో గర్భం రద్దు చేయడానికి గరిష్ట పరిమితి 24 వారాలు. గత విచారణలో పిటిషనరైన మహిళ తన గర్భాన్ని తీసేసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. ఇద్దరు పిల్లల తల్లినని, తాను డిప్రెషన్ తో బాధపడుతున్నానని, మూడో బిడ్డను పెంచే స్థితిలో లేనని మహిళ కోర్టుకు తెలిపింది.
గులాబీ గూటికి చేరిన పొన్నాల లక్ష్మయ్య
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ పార్టీతో చేరారు. జనగామ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభా వేదికగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలో చేరాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య.. 16న కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు.
45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉండి అవమానాలకు గురయ్యానని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని పొన్నాల స్పష్టం చేశారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నామని పొన్నాల ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.