కులాలు మతాలను రాజకీయాల కోసం విభజిస్తున్నారు..
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కోలువుదీరిన కనకదుర్గ అమ్మవారి నేడు బాలాత్రిపురసుందరి అవతారంలో దర్శనమిస్తుంది. అయితే, అమ్మవారిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. అన్నిటికి మూలమైన శక్తి స్వరూపిణి అమ్మవారు.. సర్వేజన సుఖినోభవంతు అంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి అని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను అని ఆమె తెలిపారు.
ఇక, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్పూర్తి.. ప్రస్తుతం కులాలు మతాలను రాజకీయాల కోసం విభజిస్తున్న పరిస్థితి నెలకొంది అని ఆమె అన్నారు. కుల మతాలకు అతీతంగా కలాం జీవితం నడిచారు.. పేద కుటుంబంలో పుట్టిన ఆయన స్వయం కృషితో దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.. కలాం అనే కంటే మిస్సైల్ మేన్ అని పిలిస్తేనే బాగుంటుంది అని పురంధేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే కలాం రాష్ట్రపతి అయ్యారు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఉన్నత పదవిలో ఉన్నా సామాన్యుడిగా ఆయన ప్రవర్తన ఉండేది అని ఆమె అన్నారు.
ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారు..
ఖమ్మం జిల్లా బీసీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఉద్దేశించి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు ఒక పక్షం ప్రయోజనాల కోసం నీతి నిజాయితీ లేకుండా పని చేయడం అనేది నీతి బాహ్యమైన చర్య అని మాజీ మంత్రి తుమ్మల ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న అధికారులు అందరూ కూడా తప్పుడు దారిలో ప్రయాణం చేస్తున్నారని ఇది పద్ధతి కాదని ఆయన సుతి మెత్తగా హెచ్చరించారు. ఇదే విధానంలో అధికారులు కొనసాగితే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. మీరు మారాల్సిన అవసరం ఉంటుందని అధికారులను ఉద్దేశించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలుకు వెళ్లి నెలరోజులు దాటింది అన్నారు. అయితే, ఆయనకు జైలులో సరియైన సదుపాయాలు కల్పించడం లేదని, ఆరోగ్యం క్షీణిస్తుందని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ అన్నారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేనాని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు
రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
సీఎం జగన్ రేపు విశాఖ పట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలిస్తున్నారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నంబర్ – 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్ – 2 ఫార్ములేషన్ బ్లాక్‌ను, ఎల్.ఎస్.పి.ఎల్ యూనిట్ – 2ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ రేపు ఉదయం గన్నవరంలో బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. హిల్ నంబరు 3పై దిగి రోడ్డు మార్గంలో హిల్ నంబర్ 2పై ఏర్పాటు చేసిన ‘ఇన్ఫోసిస్’ డెవలప్మెంట్ సెంటర్‌కు వెళ్లనున్నారు. 10.50 గంటల నుంచి 11.55 గంటల వరకు అక్కడే ఉంటారు. ఆ సెంటర్‌ను ప్రారంభించి, ఉద్యోగులతో కాసేపు సీఎం జగన్ ముచ్చటిస్తారు. తిరిగి హెలిపాడ్ దగ్గరకు చేరుకొని అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను ఆరంభిస్తారు.
బీఆర్ఎస్ కు రాజీనామా అందుకే.. బాలసాని క్లారిటీ
బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. నా ఆత్మభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సార్లు అవమానించారని అన్నారు. అధిష్టానంకు చెప్పుకుంటే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని అన్నారు. అధికార మదంతో BRS నాయకులు ప్రవర్తించారని అన్నారు. మావోయిస్టు ప్రాంతంలో కష్టపడి పనిచేశానని అన్నారు. తాతా మధు పెద్ద పుడింగా అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన నన్ను పక్కన పెట్టి పుడింగికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కటేమిటి చాలా అవమానాలు జరిగాయన్నారు. భద్రాచలం ఇంచార్జి నుంచి తొలగించడానికి కారణం చెప్పలేదు కాబట్టే రాజీనామా చేస్తున్నానని అన్నారు. పుడింగి సంగతేంటో రాబోయే ఎన్నికల్లో అక్కడే చూస్తానని అన్నారు. బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎంతమంది బీసీ లకు పదవులిచ్చారో చెప్పాలి? అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానిస్తావ్…..మమ్మల్ని అవమణిస్తావా కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పార్టీ నుండే మునుగోడులో పోటీ చేస్తా
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను బీజేపీ పార్టీ నుండి మునుగోడు లో పోటీ చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కౌరవ సైన్యంపై నైతిక విజయం మునుగోడు ప్రజలు తనకు అందించారన్నారు. ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినా గాని 87 వేల ఓట్లు వేసి నైతిక విజయం మునుగోడు ప్రజలు ఇచ్చారు వారికి అండగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలుస్తానన్నారు. కొందరు కుట్రపూరితంగా కావాలని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నానన్నారు.
నితీష్ కుమార్ ‘రెండో గాంధీ’.. బీహార్‌లో కొత్త వివాదం..
బీహార్ సీఎం నితీష్ కుమార్ అభిమానుల అత్యుత్సాహం అతనికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నితీష్ కుమార్‌ని పొగుడుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రపక్షమైన ఆర్జేడీ కూడీ ఈ వివాదాలపై ఆచితూచి స్పందిస్తోంది. తాజాగా ఓ అభిమాని నితీష్ కమార్ ‘‘దేశానికి రెండో గాంధీ’’ అని పొగుడుతూ బ్యానర్‌ని ఏర్పాటు చేశారు.
నితీష్ కుమార్ సమానత్వ పాఠం నేర్పారని పోస్టర్ లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి బీహార్ సీఎం ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీయూ నాయకులు తెలిపారు.
ఢిల్లీలో భూకంపం..3.1 తీవ్రతతో కంపించిన భూమి..
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే ఢిల్లీలో భూప్రకంపలను వచ్చాయి. ఢిల్లీలో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రకంపలను చోటు చేసుకున్నాయి. నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం రావడంతో దాని ప్రభావం ఉత్తర భారతంలో కనిపించింది.
దెయ్యం వదిలిస్తానని చెప్పి యువతిపై అత్యాచారం..
సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికీ కొందరు అనారోగ్యం బాగా లేదని బాబాలు, మంత్రగాళ్ల వద్దకు వెళ్తున్నారు. దయ్యం పట్టిందనే అపోహతో ప్రాణం, మానం మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలా కొందరు బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో చాలానే జరిగాయి.
ఇదిలా ఉంటే తాజాగా 52 ఏళ్ల మంత్రగాడు 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో జరిగింది. దుష్టశక్తులను తరిమేస్తానని చెబుతూ.. యువతిపై ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడిని శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఎస్పీ మీనాక్షి కాత్యాయన్ చెప్పిన వివరాల ప్రకారం.. మీర్జాపూర్ నుంచి ఒక కుటుంబం సీతామర్హిని సందర్శించేందుకు వచ్చిందని, వారికి అక్కడ మోతీలాల్ (52)అనే వ్యక్తి తనను తాను క్షుద్ర మాంత్రికుడిగా పరిచయం చేసుకున్నాడని, బాధిత మహిళ తల్లిదండ్రులు తమ కూతురుకు దెయ్యం పట్టిందని, నయం చేయాలని కోరారని పోలీసులు వెల్లడించారు.
ఇంగ్లాండ్ లక్ష్యం 285 పరుగులు
ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహ్మానుల్లా అఫ్గాన్ ఆటగాళ్లు గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్ రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌కు 285 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 80 పరుగులతో గుర్బాజ్ స్కోరుతో శుభారంభం చేసింది.
తర్వాత, ఇక్రమ్ 58 పరుగుల వద్ద రీసీ టాప్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వీరితో పాటు ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా 16 బంతుల్లో 28 పరుగులు చేసి వేగంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు మార్క్ వుడ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.