వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు పసికూన అఫ్గాన్ జట్టు షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహ్మానుల్లా అఫ్గాన్ ఆటగాళ్లు గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్ రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.