పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్స్.. తెలుగు రాష్ట్రాల్లో 10 మంది ఎంపిక
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా కేసుల దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం అవార్డు గ్రహీతలలో 22 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. 2023 సంవత్సరానికి గానూ “సెంట్రల్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్” కింద 140 మంది పోలీసు సిబ్బందికి కేంద్ర సర్కారు పతకాలు అందించనుంది.
కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు ప్రతీఏటా కేంద్ర హోంమంత్రి పేరిట పతకాలు అందిస్తారు. ఈ ప్రతిభా పురస్కారాలను 2018లో ప్రారంభించారు. నేర పరిశోధనలో ఉన్నతమైన, వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, దర్యాప్తులో ప్రతిభ చూపిన వారికి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న పతకాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో 140 మంది పోలీసులకు మెడల్స్ ప్రకటించగా.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్‌ఐఏ నుంచి 12 మంది, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి 18 మంది, తమిళనాడు నుంచి 08, మధ్యప్రదేశ్ నుంచి 7, గుజరాత్ నుంచి ఆరుగురు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 ఎంపిక అయ్యారు.
వాలంటీర్లపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజే చెప్పా..
విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్లతోనే ఎంపీ మిలాఖత్ అయ్యారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ ఇంట్లో వాళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను చూసి భయపడతారేంటి..? డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసిన వాళ్లే ఇలా వ్యవహారస్తారు అంటూ మండిపడ్డారు.. ఈ వ్యవహారం ఎంపీ ఇంటికి పరిమితం కాదు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్. సుజాత నగర్‌లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు పవన్ కల్యాణ్.. ఈ నెల 3న వాలంటీర్ వెంకటేష్ చేతుల్లో హత్యకు గురయ్యారు వరలక్ష్మి.. అయితే, హత్య జరగడానికి వారం ముందే వాలంటీర్‌ను విధుల నుంచి తప్పించినట్టు జీవీఎంసీ ప్రకటించిన విషయం విదితమే.. ఈ రోజు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు పవన్.. పాస్ పోర్టు కావాలంటే పోలీసు వేరిఫికేషన్ ఉండాలి.
పెద్ద మనసు చాటుకున్న సుహానా.. మహిళకు సాయం..
బాలివుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇటీవల ఒక మహిళ పట్ల చూపిన దాతృత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో కాబోయే హీరోయిన్ తన తల్లితో కలిసి ఒక రెస్టారెంట్ నుండి బయలుదేరుతున్నప్పుడు, ఒక మహిళ తనని చూసి డబ్బులు ఇవ్వాలని కోరింది.. సుహానా మొదట ఆమెకు 500 రూపాయల నోటును అందించింది, దానిని ఆ మహిళ ఆనందంగా అందుకుంది. ఆ తర్వాత ఆమె ఆనందంతో గాలిలో చేతులు విసురుతూ ఆ మహిళకు బిగ్గరగా సంతోషించడానికి కారణాలను తెలియజేస్తూ మరో నోట్‌ని అందజేసింది..
దీంతో సుహానా తన కారు ఎక్కి వెళ్లిపోయింది. ఆమె సంజ్ఞ ఇంటర్నెట్‌లో హృదయాలను గెలుచుకుంటుంది. నెటిజన్లు ఎప్పటిలాగే తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వెనుకాడరు. వారిలో ఒకరు ఛాయాచిత్రకారుల ఖాతా పోస్ట్‌లోని వ్యాఖ్యల విభాగంలో, ‘ఆమె చాలా వినయపూర్వకమైన సహాయకారిగా ఉంది’ అని రాశారు, మరొకరు షారుఖ్, గౌరీ ఖాన్‌లను క్రెడిట్ చేసి, ‘పెంపకం హార్ట్ ఎమోటికాన్‌లు’ అని రాశారు. అదే వీడియోను కలిగి ఉన్న వేరొక పోస్ట్‌పై, ఒక అనుచరుడు ఇలా వ్యాఖ్యానించాడు, ‘నేను ఇందులో ఆమె వైబ్‌ని ప్రేమిస్తున్నాను.అందుకే మళ్లీ డబ్బులు ఇస్తున్నా.. ఆమె పోస్ట్ లో పేర్కొంది..
నాలుగు నెలల్లో ఇల్లు కట్టియండి.. ఎన్ని కోట్లు అయినా ఇస్తాం..
నాలుగు నెలల్లో ఇల్లు కట్టియ్యండి.. కేంద్ర వాట ఎన్ని కోట్లైన తీసుకొచ్చే బాధ్యత మా పార్టీ ది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణేతరులూ ద్రోహం చేస్తే పొలిమేరలు వరకు తరిమి కొట్టాలని అన్నారు. తెలంగాణ వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతో పాతి పెట్టాలని కాళోజీ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో దగా పడుతుందని అన్నారు. తెలంగాణ తల్లి కేసీఆర్ చేతిలో బంది అయిందని అన్నారు. తెలంగాణ అవినీతి, కుటుంబం, నియంతృత్వ మయం అయిందని తెలిపారు. డబల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీ ఇచ్చారు కేసీఆర్ అన్నారు. ఎన్నికల ముందు గారడీ చేసే ప్రజలను మభ్య అలవాటు కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజ్యంలో డబల్ బెడ్ రూం మాటలకే పరిమితమయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నమ్మించి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రగతి భవన్, సచివాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లు కట్టుకున్నారు కానీ.. పేదలకు ఇల్లు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరుత దాడిలో చిన్నారి మృతి.. టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. గతంలో భక్తులకు చిరుతలు, ఇతర జంతువులు కనిపించినా.. దాడి చేసినా.. ఓ ప్రాణం పోవడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరం అన్నారు. ఇక, తిరుమల నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చేయించాం.. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. గతంలో బోన్ లు ఏర్పాటు చేసి చిరుతను బంధించామని గుర్తుచేసిన ఆయన.. నడకదారిలో ఫారెస్ట్, పోలీసు, టీటీడీ కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.
‘దేవర’ కోసం రంగంలోకి దిగిన అనిరుధ్…
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ ఈ సినిమా, మోషన్ పోస్టర్ తోనే టాక్ ది నేషన్ గా మారింది. దేవరగా టైటిల్ అనౌన్స్ చేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ తో పాన్ ఇండియా బజ్ కి క్రియేట్ చేసారు ఎన్టీఆర్, కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి.. యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుధ్దంలా చిత్రీకరిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్స్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది దేవర. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇది కూడా పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే అని తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నారట ఎన్టీఆర్, కొరటాల. ఈసారి బాక్సాఫీస్ ని పాన్ ఇండియా రేంజులో రిపేర్ చేయడానికి రెడీ అయిన ఎన్టీఆర్-కొరటాల శివలకి కలిసిన మరో ఆయుధం అనిరుద్. విక్రమ్, జైలర్ సినిమాలకి ప్రాణం పోసిన అనిరుద్… దేవర కోసం రంగంలోకి దిగిపోయాడు.
చేనేత కార్మికులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. రుణమాఫీపై త్వరలో నిర్ణయం
చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శనివారం భువనగిరి జిల్లా పోచంపల్లిలో జరిగిన చేనేత సమావేశంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలోని ఓ నేత ఇంట్లో కేసీఆర్ ఉన్నారని, చేనేత కార్మికుల స్థితిగతులు ఆయనకు తెలుసన్నారు. కనుముక్కులో మూతపడిన హ్యాండ్లూమ్ పార్కును రూ.12 కోట్లతో తెరుస్తున్నారని అన్నారు. చేనేత భీమా 57 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచారు. చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో నేరుగా చేనేత కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మగ్గాలను ఆధునీకరించేందుకు రూ.40 కోట్ల నిధులు ఇస్తున్నారు. చేనేత హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచారు. చేనేత వస్ర్తాలపై 5% జీఎస్టీ విధించి 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయని తప్పిదాన్ని నరేంద్ర మోడీ చేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో చేనేత భవనాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
‘గుంటూరు కారం’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!
ఇప్పటి వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా గురించి పాజిటివ్ కంటే, నెగెటివిటినే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్టేట్ ఇవ్వలేకపోతున్నాడు త్రివిక్రమ్. రీసెంట్‌గా సూపర్ స్టార్ బర్త్ డేకి కూడా ఒకటి రెండు పోస్టర్స్‌తోనే సరిపెట్టారు. అది కూడా స్టార్టింగ్‌లో వచ్చిన పోస్టర్‌ను అటు, ఇటు తిప్పి ఇదే బర్త్ డే ట్రీట్ అన్నారు. అందుకే.. గుంటూరు కారం పై ఊహించని పాజిటివ్ వైబ్ రావాలంటే సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. అది కూడా ఫస్ట్ సింగిల్ వస్తే అదిరిపోతుంది. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ అన్నీ ఎండ్ అవుతాయి. వాస్తవానికి మహేష్ బర్త్ డే రోజే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకోసం తమన్ ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఈసారి మాత్రం తమన్ గురి తప్పదంటున్నారు. ఇప్పటికే గుంటూరు కారం టైటిల్ సాంగ్ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిందట.
భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని, సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయన్నారు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించామన్నారు. మైనార్టీల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించానని, పేద విద్యార్థులు నా దగ్గరకు వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోందన్నారు ఎంపీ కోమటిరెడ్డి. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు.
మాకు కనీస సౌకర్యాలు కల్పించండి..
ప్రభుత్వం వారం వారం సమీక్షల మీద ఉన్న శ్రద్ధ.. ఉద్యోగులకు నిధులు, కనీస సౌకర్యాలు కల్పించడంపై ఉంటే బాగుండేది అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయాలకు సరిపడా సిబ్బంది, నిధులు, కనీస సౌకర్యాలు లేవు.. నూతన జిల్లా, డివిజన్ కార్యాలయాలలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది అని ఆరోపించారు. అద్దె వాహనాలకు నెలకు 35 వేల రూపాయలకు బదులు పది నుంచి పన్నెండు వేల రూపాయలు మాత్రమే చెల్లింపులపై ప్రభుత్వం కల్పించుకోవాలి అని వారు కోరారు.
రీ –సర్వే కొరకు లక్షలు ఖర్చు పెట్టాం.. చెల్లింపులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం నేతలు అన్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు జిల్లాలకు వస్తే, కనీసం ప్రోటోకాల్ బడ్జెట్ క్రింద ఒక్క రూపాయి లేదు అని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నా.. నేటికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చెయ్యకపోవడం శోచనీయం అని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొన్నారు. పని భారం, మానసిక ఒత్తిడితో పాటు ఆర్ధిక ఒత్తిడితో రెవిన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు అని వారు ఆరోపించారు.
పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇంచార్జ్ మంత్రి తానేటి వనిత రివ్యూ చేశారు. రివ్యూలో జగ్గయ్యపేట ఎమ్మెల్సీ సామినేని ఉదయభాను సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ అధికారులు, కలెక్టర్ చూడాలి అని ఆమె తెలిపారు. పార్టీలకు అతీతంగా అధికారులు అందరినీ సమానంగా చూడాలి.. వాలంటీర్స్ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు రానివారికి కారణాలు తెలుసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. రివ్యూ వల్ల అభివృద్ధి ఏం జరిగింది, పెండింగ్ లో ఉన్నదేంటి తెలుస్తుంది అని ఆమె పేర్కొన్నారు. పనులను ఎలా పూర్తి చేయాలో అధికారులు పరిశీలిస్తారు అని మంత్రి తానేటి వనితి వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.
మళ్లీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. భారీగా మరణాలు..!
కరోనా పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికి హడలే.. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన ఈ వ్యాధి జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతేకాకుండా కరోనాతో పోరాడి చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఐతే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న లోపే.. మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటికి వస్తున్నాయి.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా.. గత 28 రోజులలో (10 జూలై నుండి 6 ఆగస్టు 2023 వరకు) దాదాపు 1.5 మిలియన్ కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. అందులో 2500 మరణాలు ఉన్నాయి. గత 28 రోజులతో పోలిస్తే వరుసగా 80% పెరుగుదల మరియు 57% తగ్గుదల ఉన్నాయి. 6 ఆగస్టు 2023 నాటికి.. ప్రపంచవ్యాప్తంగా 769 మిలియన్లకు పైగా కరోనా కేసులు మరియు 6.9 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి.
లా అండ్ ఆర్డర్ దెబ్బ తీస్తే కఠిన చర్యలే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేలేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ (శనివారం) పశ్యిమగోదావరి జిల్లా నరసాపురంలో డీజీపీ పర్యటించారు. ఈసందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసులపై అల్లరి మూకలు చేసిన దాడులను ఖండించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా సరే పోలీసుల మీద దాడి చేస్తే.. కఠిన చర్యలు తప్పవు అని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
అయితే, పుంగనూర్ లో దాడికి పాల్పడింది స్థానికులా, లేక బయట నుంచి వచ్చిన వ్యక్తులా అన్నదానిపై లోతైన విచారణ చేస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ అందరి కోసం పనిచేస్తుందని రాజకీయ పార్టీలు గుర్తించుకోని తమకు సహకరించాలి అని ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కొత్త ఒరవడి సృష్టించాం.. 1.40 లక్షల మంది మహిళలు దిశా యాప్‌లో రిజిస్టర్ అయ్యారు అని ఈ సందర్భంగా డీజీపీ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 27 వేల మంది మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేశారు.. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని ఏపీ డీజీపీ తెలిపారు.
కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే
కల్వకుంట్ల కుటుంబం అంత దొంగలే అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ అరవింద్. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని, రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లలో సమస్యలు పెరిగాయన్నారు ఎంపీ అరవింద్. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయని, ట్యాంక్ బండ్ నీళ్లల్లో బోటింగ్‌కు వెళ్లే విధంగా మరుస్తాను అన్నారని, ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అన్నారని ఆయన గుర్తు చేశారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన కోర్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వైన్స్ టెండర్స్ మాత్రం పక్కగా జరుగుతాయన్నారు. దీని మతలబు ఏంటో లిక్కర్ రారాణి చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఈ మధ్య కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నేనే అని, ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి… అది లేనే లేదన్నారు. మరి ఇల్లు ఎవరు కడతారు? హౌసింగ్ శాఖ లో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసారని, కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్‌కి లేదు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని, కేసీఆర్ మాటలు చెప్పి కళ్ళలో కారం కొట్టారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. IDH కాలనీలో వంద ఇళ్లు కట్టి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో షో చేశారని విమర్శించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం కేంద్రం హడ్కో కింద 9 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు ఈటల రాజేందర్. డబుల్ బెడ్ రూం ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్ కి లేదని, ఆ రోజు మంత్రులు హరీష్ రావు, తుమ్మల, కడియం తో కలిసి ఊళ్ళలో అపార్ట్ మెంట్లు కాకుండా… వాళ్ళ వాడల్లో ఇల్లు కట్టుకునే విధంగా డబ్బులను ఇవ్వాలని కేసీఆర్ ను కోరామన్నారు.
నా జన్మ ధన్యం అయ్యే విధంగా రోజుకు 18 గంటలు అభివృద్ధి కి పని చేస్తున్నా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనమా వెంకటేశ్వర రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సహకరిస్తే కొత్తగూడెం నియోజకవర్గన్ని అభివృద్ధి లో నెంబర్ వన్ చేస్తానన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని కోట్లయిన సరే సీఎం కేసీఆర్ నాకు స్వయంగా చెప్పి కార్యచరణ ప్రారంభించమని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ ని తీసుకువచ్చి వంద పడకల హాస్పిటల్ కు శ్రీకారం చుడతామని ఆయన వెల్లడించారు.
దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ ఫోకస్
తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ పార్టీ ఫోకస్ పెట్టిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీ మెజారిటీ సాధించే దిశగా పార్టీ శ్రేణులు పని చేసి.. మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు.
ప్రతి ఓటర్ ను పోలింగ్ బూత్ లో ఓటు చేయించే విధంగా అందరు సమన్వయంతో పని చేయాలి అని వైసీపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారికి ఓటుహక్కు లభించేలా అందరు దృష్టి సారించాలి అని సజ్జల చెప్పారు. నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్ లకు సహకారం అందించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.