సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు!
దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాంగ్ డైరెక్షన్‌లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నామని ఎద్దేవా చేశారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండన్నారు. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘దేశంలోనే మార్గదర్శకంగా కులగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఎవరి లెక్క ఎంతో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పారు. రాంగ్ డైరెక్షన్‌లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదు. కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ అపిడపిట్ ధాఖలు చేసింది. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నాం. ప్రణాళిక సంఘం ఆద్వర్యంలో కులగణన సర్వే చేశాం. ఇప్పుడైనా మీ వివరాలు ఇవ్వండి.. అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు’ అని అన్నారు.
1/70 చట్టం రద్దుపై సీఎం కీలక ప్రకటన.. దానికి కట్టుబడి ఉన్నాం..
ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ కొనసాగుతోంది.. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నామని.. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు..
ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసింది.. బీసీల సంఖ్యను తగ్గించారు!
తెలంగాణలో కులగణన తప్పుల తడక అని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన చేశారని, ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసిందని మండిపడ్డారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఒప్పుకోమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పినకు అసెంబ్లీలో చట్టం చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణలో కులగణన తప్పుల తడక. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన చేశారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసింది. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఒప్పుకోము. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పినకు అసెంబ్లీలో చట్టం చేయాలి. తప్పించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం జరుగుతుంది. బీసీలకు బడ్జెట్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు సరైన పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి
ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్స్ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే, సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయన్నారు. అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని వివరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. గండికోట ఫోర్టుకు సంబంధించిన టెండర్లు స్వీకరించామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి
ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్స్ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే, సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయన్నారు. అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని వివరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. గండికోట ఫోర్టుకు సంబంధించిన టెండర్లు స్వీకరించామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు.
ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది
ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చట్టసభలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కు అండగా ఉన్నారని, షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారన్నారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని, మేం మొదటి నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసమే పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణను నాలుగు గ్రూపులు చేయాలని కోరామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీ గ్రూపులో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న వర్గాన్ని మొదటి గ్రూపులో చేర్చారన్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోటుపాట్లను సీఎం సరిదిద్దుతారని భావిస్తున్నామని ఆయన అన్నారు.
అడవి మార్గంలో శ్రీశైలానికి వచ్చే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు
అడవి మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అడవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. శైవ క్షేత్రాలు ఎక్కువగా అడవీ ప్రాంత పరిధిలోనే ఉన్నాయి.. అడవీ మార్గం ద్వారా ఆ దేవాలయాలకు వెళ్లే భక్తులను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడానికి వీలులేదని.. అందుకు తగ్గట్టుగా తక్షణమే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కాలుష్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దేందుకు తగిన స్థాయిలో గ్రీనరీని పెంచాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
హౌసింగ్ భూముల రక్షణకు ద్విముఖ వ్యూహం
ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలికసాగవు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు ఉన్న భూములను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు , దిల్ పరిధిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే ఐదు వందల ఎకరాల వరకూ ఉన్నాయి.
బీజేపీ, జనసేన నేతలే ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు..
ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి.. బాటిల్ చూపించి పదే పదే చూపించారు.. ఇప్పుడు మద్యం ధరలను పెంచి భారం మోపారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి టిడిపి నేతలు, కార్యకర్తలకు మద్యం దుకాణాలను ఇచ్చారు అని ఆయన ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో ఎంఆర్పీ ధరల కంటే అధికంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు.. ఇప్పుడు ధరలను పెంచడం వల్ల రూ. 3 వేల కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుంది.. టీడీపీ నేతల ప్రయోజనాలకే ఈ విధంగా చేశారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్‌కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారని ఆయన హెద్దేవ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడామని, మాకు ప్రాణం విలువ తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరద తగ్గుముఖం పట్టినంకనే ఖమ్మంలో మంత్రులు పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషమున్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని, కానీ రేవంత్ రెడ్డికి రోశం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని ఆయన సెటైర్ వేశారు.
ఈటల పై త్వరలోనే విచారణ.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్ ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలన్నారు కొండా సురేఖ్. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రీ సర్వే అంటున్న కేటీఆర్ తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలన్నారు. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదని, దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది… అడ్మినిస్ట్రేషన్ కు ఇబ్బంది అవుతుందన్నారు. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదని, లీగల్ లిటికేషన్స్ లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించామన్నారు కొండా సురేఖ.