NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. రేపు ఇంతకన్నా మంచి పని ఏం చేయాలని ఆలోచిస్తాను. భారతదేశానికి రైతు వెన్నుముక, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా వృత్తిలో సినిమా హిట్ అయితేనే నిజమైన పండుగ. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుంది’ అని మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సంబరాలు.. డ్యాన్సులు, పాటలతో జోష్..!

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీటైం ఆన్‌ మై మెట్రో క్యాంపెన్‌ ప్రారంభమైంది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్‌ మై మెట్రో క్యాంపెన్‌ పేరిట కోఠి ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడారు.

హైదరాబాద్ మెట్రో ఇంజనీరింగ్ అద్భుతం చేసిందని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోలను రైల్వే ఇంజనీర్లు ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టుగా చేపడతారని…. తాము హైదరాబాద్ మెట్రోను కేవలం ట్రాన్స్‌పోర్ట్ మోడ్ మాత్రమే కాకుండా నగరం ఆత్మ ప్రతిబింబించేలా నిర్మించామన్నారు. 2013లో ప్రపంచంలోని టాప్ 100 ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదానిలో మెట్రో రైల్ నిలిచిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 90 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తే రోడ్లన్నీ జామ్ అవుతాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మాత్రమే ఉపయోగపడుతుందని వెల్లడించారు.

కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం

తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది.. దీంతో, ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలోని హెలిప్యాడ్ దగ్గర సీఎం చంద్రబాబుకు వీడ్కోలు పలికారు టీడీపీ నేతలు.. అధికారులు, ఇక, ద్రావిడ యూనవర్సిటీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు.. బెంగళూరు నుంచి విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికి.. ప్రధాని పపర్యటనలో పాల్గొననున్న విషయం విదితమే..

ఇదొక లొట్టపీసు కేసు.. 2001లో ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఇదేంత..

తెలంగాణ భవన్‌లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఈరోజు రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్తుంది.. తొందరగా వెళ్లి కలవాలి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది ఎంత.. ఇదొక లొట్టపీసు కేస్.. వాడు ఒక ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఆయన పీకేది ఏమి లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినా బిడ్డగా చెబుతున్న.. ఇది నాకు ఇబ్బంది అసలే కాదు. ఇక్కడ త్రీడి పాలన నడుస్తోంది. డైవర్షన్, డిస్ట్రాక్షన్, డిమోలిషన్ అనేది మాత్రమే నడుస్తోంది. నిన్న ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ లో 90 లక్ష ల మందికి 2500 ఇస్తున్నాం అన్నారు. ఎంత అబద్ధాలు ఆడుతున్నారు చూడండి.” అని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ కోతలు పెడుతోంది

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచినట్లు గుర్తు చేస్తూ, ఉద్యమకాలపు జ్ఞాపకాలు తాజా డైరీలో ఉంటాయన్నారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యం నేటి డైరీ ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి ఉపయోగపడాలని హరీష్ రావు ఆకాంక్షించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ కోతలు పెడుతోందని విమర్శిస్తూ, దీనిపై ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి తనపై కేసులు పెట్టారని తెలిపారు. కేటీఆర్‌పై కూడా కేసులు పెట్టి కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ లోగో వంటి అంశాలను కూడా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తారు.

హీరో విశాల్ అనారోగ్యం పై… స్పందించిన నటి కుష్బూ.. !

కోలీవుడ్ హీరో అయినప్పటికి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయంగ్ సంపాదించుకున్న నటుడు విశాల్. ఈయన తమిళంలో నటించిన ప్రతి ఒక సినిమాలు తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాలు అందుకున్నాయి. ఇక ఎప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే విశాల్ ఇటీవల తన సినిమా వేడుకలో హాజరయ్యాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడితో ఎప్పుడు స్టిఫ్ గా ఉండే విశాల్ ఒకసారిగా బక్క చిక్కిపోయి కనిపించారు. ఆయన కళ్ల వెంట నీరు కారుతూనే ఉంది అలాగే ఆయన మాట్లాడేటప్పుడు కూడా వణికిపోతూ మాట్లాడటం గమనించవచ్చు. అయితే సమాచారం ప్రకారం విశాల్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు వైద్యుల తెలిపారు. కానీ జ్వరం కారణంగా ఒక మనిషి ఇంతలా మారి పోతారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఆ ఫిర్యాదులపై హైడ్రా ఫోకస్‌.. రంగంలోకి హైడ్రా కమిషనర్‌

హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్‌ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువుపై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయాంజల్ చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై ఏవీ రంగనాధ్ పరిశీలన చేశారు. ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తామని, అలాగే ఐఐటీ, బిట్స్ పిలాని, JNTU ఇంజనీరింగ్ నిపుణులతో కూడా అధ్యయనం చేస్తామని రంగనాధ్ వెల్లడించారు. NRSC ఇమేజీలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్ తో పరిశీలించి రెండు మూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు FTL నిర్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ వెల్లడించారు. నగరంలో కొన్ని చెరువులు మాయం అయితే మరికొన్ని చెరువులు FTL పరిధి పెరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని హైడ్రా కమిషన్‌ తెలిపారు. తుర్కయాంజల్‌ చెరువులోకి మురుగు నీరు వచ్చి చేరుతోందని, ఆ నీరు కిందకు పోవడం లేదని స్థానికుల ఫిర్యాదు చేశారన్నారు.

మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్న 62 ఏళ్ల నటి

తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ సినిమా 10 నామినేషన్స్ తో సత్తా చాటింది. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘ఓపెన్‌ హైమర్’ అవార్డును గెలుచుకుంది. ఇక ఆ సినిమాలో నటించిన ‘సిలియన్ మర్ఫీ’ బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు.

మందుబాబులకు వెరీ.. వెరీ.. బ్యాడ్‌ న్యూస్‌.. ఇక నో KF బీర్స్‌

తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ ప్రియుల గుండె పగిలిపోయే విషయం ఇది. కింగ్‌ఫిషర్ బ్రాండ్ బీర్ తయారీదారులైన యునైటెడ్ బ్రేవరీస్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి ‘గణనీయమైన , కొనసాగుతున్న ఆపరేటింగ్ నష్టాల’ కారణంగా తక్షణమే అన్ని బ్రాండ్‌ల కింగ్‌ఫిషర్ బీర్‌ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. బీర్ తయారీదారు గత నాలుగు సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, దాని ఉత్పత్తులకు అందించే బేస్ ధరలలో పెరుగుదల లేదని పేర్కొంది. “ఇది నష్టాలను పెంచడానికి దారితీసింది, రాష్ట్రంలో మా కార్యకలాపాలు అసమర్థంగా మారాయి” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కేటీఆర్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు..

ఫార్ముల ఈ కార్‌ రేస్‌ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరుతూ లంచ్‌ మోహన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే… కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ విచారణ జరపాలన్న న్యాయస్థానం.. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూంలో లాయర్‌ కూర్చునేందుకు హైకోర్టు అనుమతించింది.

Show comments