డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరుతో డబ్బులు గుంజుతూ మోసం చేస్తున్నారు జాగ్రత్త…
లియో సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ మేనేజర్ అనే పేరుతో డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసాడు నటుడు బ్రహ్మాజీ. నటరాజ్ దురై అనే పేరుతో ఒక వ్యక్తి… లోకేష్ కనగరాజ్ మేనేజర్ అని మాయ మాటలు చెప్పి యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆడిషన్స్ కి సెలక్ట్ అయ్యారు, కాస్ట్యూమ్స్ కొనాలి డబ్బులు పంపండి అంటూ ఫోన్ చేసి చెప్తారు వీళ్లు. బ్రహ్మాజీకి ఇలా రెండు కాల్స్ వచ్చాయి. దీంతో బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో…
పవన్ కల్యాణ్‌పై గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కి కీలక పోస్ట్
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన ఎమ్మెల్యేకు కీలక పోస్టు అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శాసనసభలో ప్రభుత్వ విప్ గా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. మోవైపు.. శాసనమండలిలో ముగ్గురు ప్రభుత్వ విప్‌లను నియమించింది ప్రభుత్వం.. మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మెరిగ మురళీధర్, పాలవలస విక్రాంత్‌ను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు.. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
స్క్వాష్‌లో భారత్‌కు స్వర్ణం.. 83కి చేరిన పతకాల సంఖ్య! టార్గెట్@100
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. స్క్వాష్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్-హరిందర్ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించారు. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ మరియు సయాఫిక్ కమల్ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించారు. స్క్వాష్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. పురుషుల జట్టు పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు, మిక్స్డ్ డబుల్స్ టీమ్ (అనాహత్, అభయ్సింగ్లు) కాంస్య పతకాలను కైవసం సాధించారు.
బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ పతకం ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియా ఆటగాడు జి జియాపై చివరి వరకూ పోరాడి 21-16, 21-23, 22-20 తేడాతో విజయం సాధించాడు. సీనియర్ స్క్వాష్ ప్లేయర్ సౌరభ్ గోషల్ సింగిల్స్ విభాగంలో పతకంపై కన్నేశాడు. అంతకుముందు ఆర్చరీలో కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణం నెగ్గింది.
ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి.. రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన “చాలా తెలివైన వ్యక్తి” అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.’
రూ. 100 లంచం తీసుకున్న అధికారి.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..?
రూ.100 లంచం తీసుకున్న అధికారి కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కోర్టు ఉపశమనం ఇచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు..2007లో రూ.100 లంచంగా తీసుకోవడం చాలా చిన్న అంశమని, లంచం కేసులో ప్రభుత్వ వైద్య అధికారిని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది. న్యాయమూర్తి జితేంద్ర జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ మంగళవారం దీనిని చిన్న విషయంగా పరిగణించి వైద్యాధికారిని నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
కేసు వివరాల్లోకి వస్తే.. 2007లో ఎల్టీ పింగళే అనే వ్యక్తి మహారాష్ట్ర పూణే జిల్లాలోని ఫౌడ్ లోని గ్రామీణ ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేసే డాక్టర్ అనిల్ షిండేపై ఆరోపణలు చేశారు. తన మేనల్లుడు చేసిన గాయాలను ధృవీకరించడానికి రూ. 100 లంచం కోరినట్లు ఆరోపించాడు. ఈ విషయంపై ఏసీబీకి పింగళే ఫిర్యాదు చేయడంతో, వల పన్ని డాక్టర్ షిండేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
22లక్షల ఓట్లను తొలగించాం.. వాళ్లు ఇంటి నుంచే ఓటు వేసే ఛాన్స్
ఓటుకు నోటు అనేది ఒకటి ఇవ్వడం.. మరొకటి తీసుకోవడం అని ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటుకు నగదు పంపిణీ ఎక్కువ సంఖ్యలో అనేది మా దృష్టికి వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నామని ఆయన చెప్పారు. చెక్ పోస్ట్ ల దగ్గర పటిష్టమైన నిఘా.. మొదటిసారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ లు పెట్టాము.. ప్రతీ చెక్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసాము అని ఈసీ తెలిపింది. ఫాల్స్ ఆఫీడవిట్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ ఆఫిడవిట్ పూర్తిగా ఆన్లైన్ లో పెడుతాం.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ్కి చేరుకున్నారు. సీఎం అధికారిక నివాసం 1 జన్ పథ్ కు ఆయన చేరుకున్నారు.. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, రేపు (శుక్రవారం) వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక, రేపు రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అయితే, ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భరత్, రెడ్డప్పా, అయోధ్య రామి రెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్, రంగయ్యలు గ్రాంఢ్ వెల్ కమ్ చెప్పారు.
పుష్ప2 మాత్రమే కాదు… బన్నీ మరో సీక్వెల్ కి రెడీ?
ఏ ముహూర్తాన రాజమౌళి, ప్రభాస్ బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చేశారో గానీ… మేకర్స్ అంతా ఇప్పుడు సీక్వెల్స్ మాయలో పడిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ పై ఉంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ దేవర కూడా చేరింది. ఇదే జాబితాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటే తెలుగులో రెండు భాగాలుగా వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. డీజే టిల్లు, గూఢచారి, ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్స్ సెట్స్ పై ఉండగా.. అఖండ, స్కంద లాంటి సినిమాలకు ఇప్పటికే సీక్వెల్స్ అనౌన్స్ చేశారు.
సీఎం కేసీఆర్ చీకట్లోకి వెళ్లిపోయారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయారు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారు.. కేసీఆర్ కి నైతికత ఉంటే సీఎం పదవి నుండి తప్పుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది.. మెగా డీఏఎస్సీ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూంలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైన ఘట్టమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు కాప్రా మండల పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో, కీసర మండల పరిధిలోని రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాప్రా మండల పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, కీసర మండల పరిధిలో గల రాంపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌కు క్వీని విక్టోరియా.. శంషాబాద్‌లో ఘన స్వాగతం
యూరప్ ఖండంలోని సెరిబియా దేశ రాజధాని బెల్గ్రేడ్ లో జరిగిన వరల్డ్ ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మిం గ్ లో బంగారు పతకం, రజత పతకాలు గెలుచుకున్న భారత స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా గురువారం తన సొంత గడ్డ హైదరాబాద్‌కు వచ్చా రు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కోచ్ లు దినేష్ రజోరియ, రాధిక, అభిమానులు పెద్ద ఎత్తున్న ఘన స్వాగతం పలికారు.
ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల పాల్గొనగా… గోల్డ్ మెడల్, రజత పతకం గెలిచాక క్వీన్ విక్టోరియా.. తొలిసారి హైదరాబాద్ వచ్చారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ లు… సన్మానించి, అభినందించారు. క్వీన్ విక్టోరియా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవి ష్యత్తులో మరిన్ని విజ యా లు సాధిస్తానని క్వీని విక్టోరి యా ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఓపెన్ వాటర్ ఫిన్ స్వి మ్మింగ్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారత స్విమ్మర్ గా గంధం క్వీని విక్టోరియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!
తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచేందుకు అవసరమయ్యే కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్! మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు @blsanthosh హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరోసారి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు చంద్రబాబుకు ఏసీబీ జడ్జ్ చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ప్రభాస్, మహేష్ బాబు.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు
ఐకాన్ స్టార్ అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ ఏడాది పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక నేషనల్ అవార్డు అందుకున్న తరువాత బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా బన్నీ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ లో సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తెలుగు నుంచి ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరాడు. తాజాగా అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్ళాడు. మైనపు విగ్రహానికి కావాల్సిన కొలతలను ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మేడమ్ టుస్సాడ్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.