ఏపీలో నేటి నుంచి తెలుగు భాషా వారోత్సవాలు
నేటి నుంచి ఏపీలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నేటి ఉదయం 11.30 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ వారోత్సవాలు ప్రారంభమౌతాయి. 29 వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా.. ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు మాట్లాడుతూ.. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
అనిరుధ్ ని కిడ్నాప్ చేసి అయినా నా సినిమాకు తీసుకోవాలని ఉంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎలమంచిలి కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు..ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రతి ఒక్క పాట ట్రెండింగ్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో యూత్ కోరుకునే అన్ని అంశాలు ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.విడుదల సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.ఖుషి సినిమాను తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ అధినేత ఎన్‌వీ ప్రసాద్ కేరళలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ముఖేష్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు
థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడు.. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ చనిపోలేదు!
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్ స్ట్రీక్ మంగళవారం తుది శ్వాస విడిచారని జింబాబ్వే మాజీ ప్లేయర్ హెన్రీ ఒలొంగ ఎక్స్ (ట్వీటర్) వేదికగా వెల్లడించారు. స్ట్రీక్ మరణం గురించి ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత హెన్రీ ఒలొంగ మరో ట్వీట్ చేశారు. థర్డ్ అంపైర్ హీత్ స్ట్రీక్‌ని వెనక్కి పిలిచాడని, అతను సజీవంగా ఉన్నాడని పేర్కొన్నారు.
‘హీత్ స్ట్రీక్ మరణానికి సంబంధించిన పుకార్లు ఎంతో అతిశయోక్తిగా ఉన్నాయి. నేను అతనితో ఇప్పుడే మాట్లాడా. థర్డ్ అంపైర్ అతనిని వెనక్కి పిలిచాడు. హీత్ స్ట్రీక్ సజీవంగా, బాగా ఉన్నాడు’ అని హెన్రీ ఒలొంగ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన క్రికెట్ ఫాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ హీత్ స్ట్రీక్ బతికున్నాడా? లేదా? అనే అయోమయంలో పడ్డారు. అయితే ఒలోంగా తన మునుపటి ట్వీట్‌ను తొలగించారు. ఇక ఒలోంగా తన వాట్సాప్‌లో స్ట్రీక్‌తో ఇటీవలి చేసిన సంభాషణకు సంబందించిన స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నారు.
చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సెలబ్రెటీలు, ట్విటర్ వేదికగా కోరుకున్న సౌత్ స్టార్స్
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసిన చంద్రయాన్ 3 గురించే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ ను కూడా ఇస్రోతో పాటు చాలా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే అన్ని ఘట్టాలను ఒక్కొక్కటిగా దాటుకుంటు వెళుతున్న చంద్రయాన్ 3 ఆఖరి ఘట్టంలోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతుంది. ఇక ఇది సక్సెస్ అవ్వాలని చాలా మంది దేవుడిని ప్రార్థిస్తు ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు కూడా చేరారు. ఎంతో బిజీగా ఉండే వారు ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది భారతీయులందరు గర్వించదగిన నిమిషం అని పేర్కొ్నారు.
అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన… సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో నాలుగు రోజులపాటు ఇండియాలో పర్యటించనున్నట్టు అమెరికా వైట్ హౌజ్ ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు జో బైడెన్ ఇండియాలో పర్యటిస్తున్నట్టు స్పష్టం చేసింది. వచ్చే నెలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించనున్నారు. అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశాల సందర్భంగానే జో బైడెన్ భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తరువాత భారత్‌కి రావడం ఇదే తొలిసారి.
టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయం
స్వాతంత్య్రోద్యమ పోరాటంలో దమ్ముంటే కాల్చండి.. రండిరా అంటూ పోలీసులకే ఎదురెళ్లి చొక్కా విప్పి రొమ్ము చరిచి నిలబడ్డ ఘనుడు టంగుటూరి ప్రకాశం పంతులు. సంతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం తన యావదాస్తిని ఖర్చు చేసిన మహాశిలి ఈ ఆంధ్రకేసరి. అయితే నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ‘స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు.’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
అంతుచిక్కని శిశు మరణాలు.. తలలు పట్టుకుంటున్న వైద్యులు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు అంతుచిక్కడం లేదు. చిన్నారులకు జ్వరం రావడంతో చికిత్సకోసం ఆసుపత్రికి వెళితే వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో శిశువులు మృతి చెందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు భయ భ్రాంతులకు లోనవుతున్నారు. పిల్లలను బతికించుకునేందుకు ఆసుపత్రికి వెళితే తిరిగిరాని లోకానికి వెళుతున్నారని ఆందోళన చెందుతున్నారు. కడుపున పుట్టిన శిశువులను తీసుకుని వైద్యం కోసం వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. ఇది వైద్యుల నిర్లక్ష్యమా? లేక చిన్నారుల్లో ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు ఒక నెల వ్యవధిలో ఇలాంటి ఏడు మరణాలు నమోదయ్యాయి. దీంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అభిమానులకు షాక్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల
శ్రీలీల చిన్నపిల్లే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పవచ్చు. మిడియమ్ రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. దాదాపు ఇప్పుడు శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రెండు సంవత్సరాల వరకు ఆమె ఖాళీగా ఉండే అవకాశమే లేదు. శ్రీలీల 2019లో కిస్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సారి ఆమె చూడగానే తన క్యూట్ లుక్స్ తో అబ్బాయిలను కట్టిపడేసింది. తరువాత పెళ్లిసందD తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో జత కట్టింది. ఈ జంట బాగుందని అప్పట్లో మంచి టాక్ వినిపించింది. ఆ సినిమాలో తన నటనతో పాటు డ్యాన్స్ తో కూడా ఆకట్టుకుంది శ్రీలీల. ఇక ధమాకా సినిమా ఈ ముద్దుగుమ్మ రేంజ్ ను ఎక్కడికో తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్ లకు, ఆమె ఎనర్జీకి చాలా మంది ఫ్యా్న్స్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి శ్రీలీల స్టార్ హీరోలకు కూడా ఫావరేట్ ఛాయిస్ అయిపోయింది. మహేష్ బాబు సరసన కూడా శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో మొదట పూజాహెగ్డేను అనుకోగా కొన్ని కారణాల వల్ల పూజ తప్పుకోగా శ్రీలీల ఆ అవకాశాన్ని అందుకుంది.
చంద్రయాన్-3 విజయవంతమవ్వాలని ముస్లింల ప్రార్థనలు
చంద్రుడి రహాస్యాలను తెలుసుకోవడం కోసం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమవ్యాలని దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడి కూడా ఇదే కోరుకుంటున్నారు. చంద్రయాన్-3 విజయవంతం కావాలని మతాలకతీతంగా పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే లక్నోలోని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులు లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో నమాజ్ చేశారు. చంద్రయాన్ -3 భారతీయ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 06.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ దిగనుంది. దీని కోసం భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రయాన్ -3 చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ముస్లింలు లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో సోమవారం నమాజ్ చేశారు. మూన్ మిషన్ విజయం సాధించాలని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏషియా న్యూ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది. అందులో భారత మూన్ మిషన్ కోసం ముస్లింలు ప్రార్థిస్తున్నారు.
హరీష్ రావుపై తీవ్ర విమర్శలు.. మైనంపల్లి స్థానంలో మరో అభ్యర్థి..!
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తొలి దశ జాబితా ప్రకటించినప్పటి నుంచి హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో హన్మంతరావుపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇప్పటికే ఆయనకు పార్టీ టికెట్ కేటాయించగా.. అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు సమాచారం. మల్కాజిగిరి సీటుతో పాటు మెదక్ సీటు కూడా తన కుమారుడికి ఇవ్వాలని హన్మంతరావు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే అంశంపై ఆయన ఈ నెల 21న కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును చాలా మంది నాశనం చేశారని, తన కుమారుడికి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రబ్బర్ చెప్పులతో వచ్చిన వ్యక్తి లక్షల కోట్లు సంపాదించాడని తిరుమలలో హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది.
నేడు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు
ఏపీలో పలు చోట్ల నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. నిన్న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి.
పిల్లలు పుట్టలేదని ఆసుపత్రికి వెళ్లగా.. పురుష, స్త్రీ జననాంగాలున్నాయని షాక్ ఇచ్చిన వైద్యులు!
మనషుల్లో కొందరు పలు రకాల అవయవాల లోపంతో లేదా ఎక్కువ అవయవాలతో పుడుతూ ఉంటారు. అయితే వాళ్లలో ఏర్పడే జననాంగాల ద్వారా స్త్రీ, పురుషులుగా గుర్తిస్తారు. అయితే తెలంగాణలో ఓ వ్యక్తి పురుష, స్త్రీ రెండు జననాంగాలతో జన్మించాడు. ఈ విషయం అతడికి పెళ్లయి, పిల్లలు పుట్టకపోవడంతో ఆలస్యంగా తెలిసింది. ఆ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందినట్టు గుర్తించిన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వాటిని విజయవంతంగా తొలగించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ సమస్య తలెత్తినట్టు వైద్యులు పేర్కొన్నారు.
మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై చాలా ఏళ్లు గడిచినా.. పిల్లలు పుట్టలేదు. తరచూ పొత్తి కడుపులో నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ యురాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వైఎం ప్రశాంత్ అతడిని చెక్ చేశారు. అతనికి అల్ట్రాసౌండ్ సహా పలు పరీక్షలు చేశారు. అతనిలో పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ.. వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉన్ననట్లు గుర్తించారు. అంతేకాదు స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్‌లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు.
గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు కన్నుమూత
గణిత శాస్త్రవేత్త సీఆర్ రావుగా పేరుగాంచిన కల్యంపుడి రాధాకృష్ణ రావు (CR Rao) కన్నుమూశారు. భారత్‌కు చెందిన అమెరికా గణిత శాస్త్రవేత్త అయిన సీఆర్ రావు ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యాశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. 1968లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, 2001లో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బహుమతిగా భావించబడే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయన ఈ ఏడాది గెలుచుకున్నారు. ఆధునిక గణిత శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా పేర్కంటారు. మల్టీవేరియేట్ విశ్లేషణ, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి లాంటి అంశాల్లో సీఆర్ రావు విస్తృతంగా పనిచేశారు. కర్నాటకలోని హడగలిలో ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబరు 10న సీఆర్ రావు జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడురు, నూజివీడు, నందిగామ, విశాఖల్లో ఆయన పాఠశాల స్థాయి విద్యాభ్యాసం కొనసాగించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంస్సీ మ్యాథమెటిక్స్‌లో పట్టా పొందారు. 1943లో కల్‌కత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్‌టిక్స్ పూర్తి చేశారు. ఆ తరువాత గణిత శాస్త్రంలో పీహెచ్‌డీ కోసం ఆయన బ్రిటన్ వెళ్లారు. సర్ రోనాల్డ్ ఏ వద్ద పీహెచ్‌డీ పూర్తి చేశారు. తొలుత ఆయన ఇండియన్ స్టాటిస్‌టికల్ ఇన్స్‌టిట్యూట్, క్యాంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశారు.