డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..
అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సృష్టించింది.. దేవరపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం ఇల్లు, రాకపోకలు సాగించే మార్గంలో అగంతకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు.. ఓ కారు, రెండు బైక్ ల పై వచ్చిన అగంతకులు ముత్యాలనాయుడు ఇల్లు, పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు.. డ్రోన్లు ఎగిరే సమయంలో ఇంట్లోనే ఉన్నారు ముత్యాల నాయుడు.. డ్రోన్లను గమనించి.. డిప్యూటీ సీఎం అలర్ట్ అవ్వడంతో.. డ్రోన్ లు ఎగురవేసిన యువకులను వెంబడించి పట్టుకున్నారు స్థానికులు.. తనపై హత్యాయత్నం కోసం పన్నాగంలో భాగంగానే డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆరోపిస్తున్నారు..
నగరిలో కొత్త పంచాయతీ..! మంత్రి రోజాకు రివర్స్ షాక్..!
ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నుంచి సమస్యలు ఉన్నాయి. రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమెకు స్థానిక నేతలతో విభేదాలు తలనొప్పిగా మారాయి. నగరి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయని నేతలు చెబుతున్నమాట.. గతంలో రోజాను గెలిపించనవారే.. ఆమె తీరు నచ్చకపోవడంతో.. తిరుగుబాటు చేశారు.. ఇక, ఈ రచ్చకు పులిస్టాప్ పెట్టేందుకు వడమాలపేట జెడ్పీటీసీ మురళీరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. మురళీ గత కొంత కాలంగా మంత్రి రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు.. ఆమెకు టికెట్ కేటాయించొద్దని వైసీపీ అధిష్టానాన్ని సైతం కోరారు. అలాగే ప్రొటోకాల్ విషయంలోనూ విభేదాలు నడిచాయి.. మరోవైపు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ముద్రపడిన మురళీరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడడంతో.. జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రోజా వద్దు.. పార్టీ ముద్దు అంటూ.. ప్రెస్ మీట్ పెట్టారు మురళీరెడ్డి.. అయితే, అతడిపై వేటు వేస్తే.. అంతా దారిలోకి వస్తారని పార్టీ భావించింది.. కానీ, దానికి భిన్నంగా మంత్రి రోజాకు షాక్ ఇచ్చింది వ్యతిరేకవర్గం.. ఆ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేశారు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు రోజాకు సపోర్ట్‌గా ఉన్న నేతలు షాక్ ఇవ్వడంతో.. ఎన్నికల్లో ఏం జరుగుతుందో నన్న చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి ఆర్కే రోజా.. ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
నేను చేసిన అప్పులు నేనే కట్టాలా..? లక్షల కోట్ల అప్పులు బాబే కడతారా..?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విపక్ష కూటముల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపిస్తోన్న తరుణంలో.. విపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మా హయాంలో నేచేసిన అప్పులు మేమే కట్టాలంటే.. గతంలో మీరు చేసిన అప్పులు మరి మీరే కడతారా? అంటూ నిలదీస్తున్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. నేను చేసిన అప్పులు నేనే కట్టాలా? అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అంతే కాదు.. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పులు అతనే కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, నా వెంట వస్తే నేను చేసిన అభివృద్ధి చూపిస్తాను అంటూ సవాల్ విసిరారు.. నీ వెంట నేను స్వతా.. మరి నువ్వు చేసిన అభివృద్ధి చూపిస్తావా? అంటూ ప్రశ్నించారు మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ..! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద కుట్ర..!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు తేలిగ్గా లాక్కోవాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆరోపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడా అమలు చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వీరభక్త హనుమాన్ అయిన వైఎస్ జగన్ మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారని.. కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోదీది తప్పు అని మాత్రం చంద్రబాబు అనడం లేదని విమర్శించారు. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక మీడియా సమావేశం నిర్వహించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. బీజేపీకి పొత్తు, తొత్తుగా ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. తనకు కావాల్సిన కార్పొరేట్ల కోసం ప్రధాని మోడీ పరిపాలన జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే 15 పోర్ట్ లు, 6 విమానశ్రయాలు అదానికి కట్టబెట్టారని, అలాగే ప్రధాని మోడీ.. 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు రద్దు చేశారని విమర్శించారు. రైతుల రుణాల రద్దు చేయమంటే మోడీకి మనసు రాలేదని అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.. నరేంద్ర మోడీ పరిపాలన చూశాక కాంగ్రెస్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు.
ఏపీలో కూటమి గెలుపు.. మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం..!
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిదే విజయం.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయేన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు మోడీ చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. ప్రజల్లో చీలిక తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి ఖాయం.. మోడీకి సరితూగే నాయకుడు విపక్షాల్లో ఒకరు కూడా లేరన్నారు లక్ష్మణ్.. అవినీతి పార్టీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసినా.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అవినీతి పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు.. మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.. బీసీలను బానిసలుగా చేసి వైఎస్ జగన్ పాలన ఏ రకంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సారి ఆంధ్రప్రదేవ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి గెలుపు ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.
అభివృద్ధి కావాలా.. విధ్వంసం కావాలా.. ప్రజలు తేల్చుకోవాలి..
అభివృద్ధి కావాల్నా విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలని బీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇది కొత్త ప్రభుత్వం కాదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుందన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు. మళ్లీ గెలిస్తే అమలు చేయడన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడుతుందన్నారు. అభివృద్ధి కావాల్నా విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. నేను గెలిచిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నారు. నేను చెప్పింది చేసి చూపించానని తెలిపారు. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ లు అని మండిపడ్డారు. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. దీంతో ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు
రేపే నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్,పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలకు, షరతులకు పరీక్ష నిర్వహణ కు సంబంధించిన నీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్ మంజుల దేవి వివరాలను వెల్లడించారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్నారు. పరీక్షకు 5205 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలున్నాయన్నారు. ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుందన్నారు.
పాలలో ఆక్సీటోసిన్.. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన నివేదికలో షాకింగ్ నిజాలు
రోజువారీ జీవితంలో పాలు చాలా ముఖ్యం. ఉదయం టీ నుండి రాత్రి వరకు ఉపయోగించబడుతుంది. అయితే మీరు తీసుకునే పాలు ఎంత సురక్షితమో తెలుసా? ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో నివేదిక దాఖలైనందున ఈ ప్రశ్న అడుగుతున్నాం. ఢిల్లీలో సరఫరా అవుతున్న పాలలో ఆక్సిటోసిన్ వాడుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. 2018లో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఔషధం ఇదే. పాల ఉత్పత్తిని పెంచేందుకు పశువులపై దీనిని దుర్వినియోగం చేస్తున్నారని, దీని వల్ల పశువులపైనే కాకుండా పాలను తినే ప్రజలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని అప్పుడు ప్రభుత్వం పేర్కొంది. పాడి పశువులపై ఈ మందును దుర్వినియోగం చేసి దిగుబడిని పెంచడం వల్ల పశువుల ఆరోగ్యంపైనే కాకుండా పాలను తినే మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని 2018 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీని తర్వాత, రాజధానిలో ఆవులు, గేదెలను ఉంచే డెయిరీలలో ఆక్సిటోసిన్ దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. హార్మోన్ సంబంధిత మందులు ఇవ్వడం జంతు హింస, నేరమని కోర్టు పేర్కొంది.
ప్రియాంక గాంధీని రాహల్ తొక్కేస్తున్నాడు..
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య ఆధిపత్య పోరు గత కొన్నేళ్లుగా కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రిసెంట్ గా లోక్‌సభ ఎన్నికల్లో కిషోరి లాల్ శర్మ అమేథీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఈ ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాపులారిటీ ఉందని చెబుతున్నా రాహుల్ గాంధీ శిబిరం రాబర్ట్ వాద్రాను అమేథీ సీటు ఇవ్వకపోవడంతో పాటు ఆయన్నీ పట్టించుకోలేదని బీజేపీ నేత అమిత్ మాల్వియా అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా త్వరలో కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. వారిద్దరినీ ఒక క్రమపద్ధతిలో రాహుల్ గాంధీ పక్కదారి పట్టిస్తున్నాడని మాళవియ పేర్కొన్నారు. అలాగే, ప్రియాంక గాంధీ వాద్రాపై కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సైతం ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకూడదనుకుంటే.. ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి నుంచి పోటీ చేస్తే సరిపోయేది కదా అని ప్రశ్నించారు.
గ్రహాంతరవాసులు ఉన్నట్లేనా.. 22 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్
హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్ పవర్స్‌తో కూడిన ‘మ్యాజిక్’ గ్రహాంతర వాసి హృతిక్‌కి ఎంతగానో సహాయం చేస్తాడు. ఇది సినిమా, కానీ నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే, మనం వారితో ఎలా మాట్లాడగలం? గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది, అయితే గ్రహాంతరవాసుల ఉనికి ఇంకా రుజువు కాలేదన్నది నిజం. మనం గ్రహాంతరవాసులను సినిమాల్లో మాత్రమే చూస్తాం. లేదా కొన్నిసార్లు గ్రహాంతర అంతరిక్ష నౌకగా చెప్పబడే అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ (UFOs) భూమిపైకి వస్తాయనే పుకార్లు వింటాము. అయితే, గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనేది వేరే చర్చ, కానీ గ్రహాంతరవాసులు ఉంటే వారితో మాట్లాడే అవకాశం పెరిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (నాసా) అద్భుత విజయాన్ని సాధించింది. ఇటీవల నాసా భూమిపై అంతరిక్షంలో 22.5 కిలోమీటర్ల దూరంలోని సందేశాలను స్వీకరించడంలో విజయవంతమైంది.
ఇండోనేషియాలో వరదలు.. 14 మంది మృతి
ఇండోనేషియాను భారీ వరదలు ముంచెత్తాయి. సులవేసి ద్వీపంలో వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మరణించారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. సులవేసిలోని వాజోలో వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయని స్థానిక రెస్క్యూ చీఫ్ మెక్సియానస్ బెకాబెల్ తెలిపారు. భారీ వరదలు 13 జిల్లాలపై ప్రభావితం చూపాయి. అంతేకాకుండా మొత్తం ప్రాంతాలన్నీ బురదతో నిండిపోయాయి. వెయ్యికు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయ బృందం.. ప్రజలను ఇళ్లలోంచి ఖాళీ చేయిస్తున్నారు. మసీదులు, బంధువుల ఇళ్లకు బాధితులను తరలిస్తున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి శనివారం తెలిపారు. వర్షాల కారణంగా ఇండోనేషియాలో తరచుగా కొండచరియలు విరుగుపడుతుంటాయి. అలాగే వరదలు సంభవిస్తుంటాయి. ఈ దీవుల్లో మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని తానా తోరాజా జిల్లాలో ఏప్రిల్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు.
హమ్మయ్య.. రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీ..
ఉస్తాద్ రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ ,పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందించింది.ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం పూరి డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8 న గ్రాండ్ గా రిలీజ్ అయి వుండాల్సింది .కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ తన కెరీర్ లోనే సరికొత్తగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో మేకర్స్ వెల్లడించలేదు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరిగిన ఈ సినిమా తాజాగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచినట్లు గత కొంత కాలంగా వస్తున్నాయి.తాజాగా ముంబై లో కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు ఈ సినిమా నిర్మాత ఛార్మి ప్రకటించడంతో రామ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.తాజాగా షూటింగ్ సెట్ లో పూరి జగన్నాధ్, ఛార్మి పూజలు చేసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన షెడ్యూల్ ఆ గణేశుడి ఆశీర్వాదంతో మొదలయింది అని ఆమె తెలిపింది. ఈ షెడ్యూల్ లో బిగ్గెస్ట్ క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
హనుమాన్ కోసం అదే రిఫరెన్స్ గా తీసుకున్నా..
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి విగ్రహం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అంజనాద్రి కొండపై వెలిసిన ఈ విగ్రహం ఆ మూవీకే హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ హనుమంతుడి విగ్రహం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు తెలియజేసాడు .ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకుని డిజైన్ చేసినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. స్టాలిన్ సినిమాలోని ఆ పోస్టర్ లో చిరంజీవిని చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తుంటాయి. అందుకే ఆ పోస్టర్‌ను మేము రిఫరెన్స్‌గా వాడుకున్నాం.ఫైనల్ గా అదిరిపోయే అవుట్ ఫుట్ వచ్చినట్లుగా ప్రశాంత్ వర్మ తెలిపారు..