Female Caregiver Arrested For Trying To Extort Money From Yuvraj Singh Mother: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించిన ఓ మహిళను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ యువీ తల్లిని ఆమె బెదిరించింది. సదరు మహిళ ఇదివరకు యువరాజ్ కుటుంబంలో సహాయకురాలిగా పని చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్‌సింగ్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం (డిప్రెషన్)తో బాధపడుతున్నాడు. దాంతో యువీ తల్లి షబ్నం సింగ్.. 2022లో హేమా కౌశిక్ అనే మహిళను జోరవీర్‌కు సహాయకురాలి (కేర్ టేకర్)గా నియమించారు. అయితే హేమా తీరు నచ్చకపోవడంతో.. ఉద్యోగంలో చేర్చుకొన్న 20 రోజుల్లోనే యువీ తల్లి ఆమెను తొలగించారు. అప్పటినుంచి హేమా కౌశిక్ ఈ విషయంపై అసంతృప్తిగా ఉంది.
Also Read: Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో
ఈ ఏడాది మే నుంచి హేమా కౌశిక్ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్‌ను బెదిరించడం మొదలు పెట్టింది. రూ. 40 లక్షలు ఇవ్వకపోతే కుటుంబం పరువు తీస్తానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిత్యం హెచ్చరిస్తోంది. ఈ బెదిరింపులపై యువీ కుటుంబం గురుగ్రామ్‌లోని డీఎల్‌ఫ్-1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ఓ ప్లాన్ వేశారు.
రూ. 5 లక్షలు ఇచ్చేందుకు యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్ అంగీకరించినట్లు హేమా కౌశిక్‌కు పోలీసులు చెప్పారు. ప్లాన్ ప్రకారం ఆమెను ఓ మాల్‌కు రప్పించి.. అక్కడే అరెస్టు చేశారు. తాము నిందితురాలు హేమా కౌశిక్‌ను ప్రశ్నిస్తున్నామని గురుగ్రామ్ ఈస్ట్ డీసీపీ నితీశ్ అగర్వాల్ చెప్పారు. సదరు మహిళ దక్షిణ ఢిల్లీలో నివాసం ఉంటోందని పేర్కొన్నారు.
Also Read: TS Crime News: వీడియోస్ చేస్తుందని.. చెల్లిపై రోకలిబండతో దాడి చేసిన అన్న! చివరకు..