Tollywood Movie Shootings: టాలీవుడ్లో ప్రస్తుతం షూటింగ్స్ హోరెత్తుతున్నాయి. సెప్టెంబర్‌లో వచ్చిన విజయాల జోష్‌తో అక్టోబర్ నెలలోనూ స్టార్ హీరోలు వరుసగా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నారు. కొత్త సినిమాలను త్వరగా థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో స్టార్లు వివిధ లొకేషన్లలో కష్టపడి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అదే స్టూడియోలో నాని ప్రధాన పాత్రలో ‘పారడైస్’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక సర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’ సినిమా కోసం అక్కడే భారీ సెట్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజాసబ్’ చిత్రంలోని పాటల చిత్రీకరణ యూరప్‌లో జోరుగా సాగుతోంది.
Kiara Abbavaram : నా పై సింపతీ వద్దు.. కంటెంట్ నచ్చితేనే రండి..
ఇక ‘మన శంకర వరప్రసాద్’ కొత్త సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన భాగాన్ని పూర్తి చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన మిగతా సన్నివేశాలు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ ఆర్ఎఫ్సీలో సాగుతోంది. ఇంకా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ముంబైలో షూటింగ్ దశలో ఉంది. అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో నాగచైతన్య NC24 షూటింగ్లో పాల్గొంటున్నారు. అక్కడే విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ సినిమా చిత్రీకరణ కూడా కొనసాగుతోంది.
Venugopal Rao: మావోయిస్టులకి భారీ ఎదురుదెబ్బ.. 60మంది మావోయిస్టులు లొంగుబాటు
ఇక ప్రశాంత్ వర్మ నిర్మాణంలో పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మహాకాళీ షూటింగ్ ముచ్చింతలలో జరుగుతోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతుండగా, యూనిట్స్ అంతా వరుసగా సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్లో అక్టోబర్ నెల మొత్తం షూటింగ్‌లతో సందడి వాతావరణం నెలకొంది.