ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చేసే నేరాలు ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. చదువుకున్న వాళ్ళు సైతం వారి మాయలో పడి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్న వైనం రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఒక తెలుగు హీరోకి సైబర్ నేల గాళ్లు వలవిసిరి భారీగా దండుకున్నారు. టాస్కుల పేరుతో ఒక టాలీవుడ్ హీరో నుంచి దాదాపు 45 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. యూట్యూబ్లో ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని సైబర్ నేరగాళ్లు హీరోని నమ్మించారు. ఆ టాస్కులు పూర్తిచేసి కొంత డబ్బు రావడంతో మొత్తం 45 లక్షల రూపాయలు ఫైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లలో వేశాడు టాలీవుడ్ హీరో భిష్ణు అధికారి.
Read Also: Forgotten Items In Hotels: హోటల్స్‌లో ఎక్కువ మంది మరిచిపోయే వస్తువులు ఇవే..
ఆ డబ్బులు వేసిన తర్వాత కూడా మరిన్ని టాస్కులు ఇచ్చి డబ్బు వెనక్కి వస్తుందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. చివరికి 45 లక్షలు మోసపోయానని తెలుసుకొని సైబర్ పోలీసులను భిష్ణు అధికారి ఆశ్రయించారు. ఇక తెలుగులో బిష్ణు అధికారి హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగా యాక్షన్ సినిమా తీశారు. ఆ చిత్రమే ‘హిట్ మ్యాన్’. బిష్ణు అధికారి కథానాయకుడిగా 99 సినిమాస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా లో అదితి శర్మ, ఆంచల్ శర్మ నాయికలు కాగా దీపక్ అధికారి నిర్మాత. బిష్ణు అధికారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ఆర్మీ వర్సెస్ పోలీస్.. సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని నిరసన..