నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 టోల్ ప్లాజాల వద్ద ఛార్జీలను పెంచింది. జాతీయ రహదారుల రుసుము (రేట్లు మరియు వసూళ్ల నిర్ణయం) రూల్స్, 2008 ప్రకారం, ఫీజు రేట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2024 వరకు అమల్లో ఉండేలా ధరలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధికారులు నిర్ణయించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతియేటా పెంచే టోల్ చార్జీల నిబంధనల మేరకు ఓఆర్‌ఆర్‌పై కొత్త టోల్‌చార్జీలు అమలు చేయనున్నారు. నగరం చుట్టు 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్‌ఆర్‌పై 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లను నిర్మిస్తున్నారు.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత అంశం.. గమనిస్తున్నామన్న జర్మనీ
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని జాతీయ రహదారులు, ఓఆర్‌ఆర్ గుండా వెళ్లే వాహనదారులు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించిన టోల్ ఫీజులను విచక్షణారహితంగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలోకి వెళ్లేందుకు, బయటికి వెళ్లేందుకు దాదాపు రూ.160 చెల్లించాల్సి వస్తోందని ఆ ప్రాంత వాసులు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో కూడా ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా మరియు సామాన్యుల పట్ల శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా, క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ, “ఎన్‌హెచ్‌ఎఐ నిర్వహిస్తున్న అన్ని రీచ్‌లలో వాగ్దానం చేసిన సౌకర్యాలు ఏవీ రాలేదు” అని టాక్సీ డ్రైవర్ల యూనియన్ నాయకుడు షేక్ సలావుద్దీన్ అన్నారు.
Also Read : Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?