ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
నేడు కాకినాడకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ.. రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థినులతో మాట్లాడనున్న శైలజ.. నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలు చేసిన 50 మంది విద్యార్థినులు
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30 గంటలకు చేరుకోనున్న జగన్
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రామచంద్రరావు జిల్లాలో పర్యటన.. కలెక్టరేట్లో సమీక్షలో పాల్గొనున్న రామచంద్రరావు
అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం.. నేడు రాజంపేటలో 9 మృతదేహాలకు పోస్టుమార్టం.. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు
నేడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పర్యటన.. సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
ఇవాళ గూడూరు కోర్టుకు మాజీ మంత్రి కాకాణి.. ఇరువూరులో మద్యం నిల్వలు దొరికిన కేసులో నిందితుడుగా మాజీ మంత్రి.. పీటీ వారెంట్ మీద జిల్లా జైలు నుంచి గూడూరు కోర్టుకు తీసుకురానున్న పోలీసులు
నేటి నుంచి విశాఖ వేదికగా “బిమ్స్ టెక్” 2025 కాన్ క్లేవ్.. సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి శర్భా నంద్ సోనోవాల్
బల్లికురవ మండలం ముక్తేశ్వరంలో సుపరిపాలన తొలిఅడుగు-ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్
చీమకుర్తిలో సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ఉదయం 10 గంటలకు గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో (మెదక్, సంగారెడ్డి , సిద్దిపేట) మంత్రి పొన్నం మీటింగ్.. మధ్యాహ్నం 12:00 గంటలకు గాంధీ భవన్లో ప్రెస్ మీట్
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న సీఎం
ఈరోజు ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. రంగం భవిష్యవాణి కోసం కుమ్మరి ఇంటి నుంచి మేళతాళాలతో పచ్చి కుండను ఆలయానికి తీసుకురానున్న పండితులు
నేడు కాటారం, మహదేవపూర్, మహముత్తారం మండలాల్లో పర్యటించనున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. కాటారంలో స్వయం సహయక మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి
నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. చింతకానిలో ఇందిర మహిళా శక్తి సంబరాలల్లో పాల్గొన్ననున్న భట్టి
నేడు హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు.. KRamp గ్లింప్స్ నేడు రిలీజ్ కానుంది
లార్డ్స్ టెస్టులో నేడు చివరి రోజు.. చివరి రోజు భారత్ విజయానికి 135 అవసరం కాగా, ఇంగ్లాండ్ ఆరు వికెట్లు తీయాలి