Director Lakshmi Dheeptha: సినీ పరిశ్రమలో వేధింపుల పదం తరచూ వినపడుతూనే ఉంటుంది.. టాప్ హీరోయిన్లు సైతం.. తమకు కూడా ఆ వేధింపులు తప్పలేదు.. కమిట్‌మెంట్లు అడిగారు.. ఒంటరిగా గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారు.. ఎవరూ లేకుండా ఏకాంతంగా వచ్చి కలువు.. ఇలాంటివి విషయాలను కొన్ని సందర్భాల్లో బయటపెట్టారు.. కొన్ని వేదికలపై.. ప్రత్యేక ఇంటర్వ్యూల్లో.. అడిగిన ప్రశ్నలకు కావొచ్చు.. తమకు ఎదురైన అనుభవాలను పంచుకునే క్రమంలో కావొచ్చు.. ఆ విషయాలను సైతం వెల్లడిస్తున్నారు.. అయితే, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. ఎందకంటే.. ఓ మహిళా డైరెక్టరే వేధింపులకు దిగిందట.. ఓ యువ నటుడిని బెదిరించి, అసభ్యకరమైన వెబ్ సిరీస్‌లో నటించాలంటూ బలవంతం చేసింది.. ఈ వ్యవహారం ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది..
Read Also: YSR Village Clinics: కేంద్రం ప్రశంసలు.. ఏపీలో ఆరోగ్య సేవలు భేష్
అయితే, డైరెక్టర్ లక్ష్మి దీప కేరళ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. పలు సినిమాలు తెరకెక్కించి విజయం అందుకున్న ఆమె.. గతేడాది ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిచింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో నటించిన ప్రధాన నటుడు ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.. మహిళా డైకెక్టర్ నన్ను బెదిరిస్తోంది, అసభ్యకరమైన వెస్ సిరీస్‌లో నటించాలని బలవంతం చేస్తోంది అంటూ ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఇక, ఆ పటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. సదరు మహిళా డైరెక్టర్‌ను అరెస్ట్ చేయాల్సింది కేరళ పోలీసులను ఆదేశించింది. దీంతో రెండు రోజులు క్రితం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.. ఆ వెంటనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నెడుమంగడ్ కోర్టు.. ఇక, 6 వారాల పాటు ప్రతి బుధ, గురువారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. విచారణ అధికారికి అవసరమైన సాక్ష్యాలను కూడా ఆమె సమర్పించాలి.. విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది.. మొత్తంగా మహిళా డైరెక్టర్ చేసిన బలవంతం.. కోర్టు వరకు వెళ్లి.. అరెస్ట్‌కు దారి తీసింది.