ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వేలేరు మండలంలోని సోడషపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.104 కోట్లతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన మూడు మినీ ఎత్తిపోతల పథకాలకు మంత్ర కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్ర నుంచి వేలేరు మండల కేంద్రం వరకు రూ.25 కోట్లతో వేసిన డబుల్‌రోడ్డును ప్రారంభిస్తారు. రూ.10 కోట్లతో చేపట్టిన నారాయణగిరి-పీచర రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Manish Sisodia: నేడు కోర్టుకు మనీష్ సిసోడియా.. దేశవ్యాప్త నిరసనలకు ఆప్ ప్లాన్
అనంతరం శోడషపల్లి శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు మంత్రి కేటీఆర్. సభా ప్రాంగణం చుట్టూ వాహనాల పార్కింగ్‌కు సిద్ధం చేశారు. సుమారు 30 వేల మంది హాజరు కానున్నట్టు అంచనా వేసి, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. మంత్రి రాక సందర్భంగా జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటనకు సంబంధించిన ఏర్పాటు పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. సభ తర్వాత హైదరాబాద్ రానున్నారు.
Also Read : DK Aruna : ప్రీతి మృతి చాలా బాధాకరం.. సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలి