ఖైదీ సినిమాతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఇండెంటిటీని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్… ఇటీవలే దళపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రెజర్ కారణంగానే సెకండ్ హాఫ్ ని అనుకున్నంత గొప్పగా చేయలేకపోయాను, ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని స్వయంగా లోకేష్ కనగరాజ్ చెప్పాడు అంటే లియోపై ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా రిజల్ట్ నుంచి బయటకి వచ్చి రజినీకాంత్ తో చేయబోతున్న తలైవర్ 171 సినిమా కథ కంప్లీట్ చేయడానికి లోకేష్ కనగరాజ్ అండర్ గ్రౌండ్ వెళ్లిపోయాడు. ఎప్పటిలాగే ఒక కథ రాసే సమయంలో జనరల్ పబ్లిక్ నుంచి, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండే లోకేష్… రజినీకాంత్ సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ చేస్తున్నాడు. అయితే రజినీకాంత్ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది.
తన మార్క్ ని చూపించడానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని రెడీ చేసిన లోకేష్ కనగరాజ్… లియో సినిమా తవాత డైరెక్ట్ గా రజినీకాంత్ ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ చేయకుండా ఒక షార్ట్ ఫిల్మ్ ని చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించిన 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ని చేసిన లోకేష్… త్వరలో దీని అప్డేట్ బయటకి వస్తుంది అని చెప్పాడు. లియో సినిమాని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చెయ్యకుండా అనవసరంగా LCUలో ఇరికించాడు అంటూ లోకేష్ పై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి, ఇలాంటి సమయంలో షార్ట్ ఫిల్మ్ కూడా LCU పైనే చేసి రిలీజ్ చెయ్యడం మరింత నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా ఎక్కువగా ఇచ్చేయకూడదు, లోకేష్ ఈ విషయం అర్ధం చేసుకోని LCUకి సంబంధించిన కంటెంట్ ని ఆచితూచి జాగ్రతగా ప్లాన్ చేసి ఆడియన్స్ కి ఇస్తే బాగుంటుంది అంతే కానీ హైప్ ఉంది కదా అని ఫాస్ట్ గా ఫాస్ట్ గా చేయడం LCU వరల్డ్ కి మంచిది కాదు.