ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 11 వ రోజు కొనసాగనున్నాయి. అయితే, నేడు సభ ముందుకు కీలక బిల్లులు వెళ్లనున్నాయి. లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ ప్రారంభించనున్నారు.
రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.