Today Gold Rates: భారతీయులకు బంగారం (Gold) అనేది కేవలం ఆభరణం లేదా ఆస్తి మాత్రమే కాదు.. ఒక సాంస్కృతిక సంపద. ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా పసిడి కొనుగోలు తప్పనిసరి అనే రీతిలో మన దేశంలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే బంగారం ధరల్లో జరిగే హెచ్చుతగ్గులు ప్రతి కుటుంబాన్నీ ప్రభావితం చేస్తాయి. గత ఇరవై రోజులుగా నిరంతరంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు చివరికి నేడు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న రేట్లు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగించగా, ఈరోజు వచ్చిన తగ్గుదల వారికి నిజమైన ‘బిగ్ రిలీఫ్’ గా మారింది. గత కొన్నిరోజులుగా గ్రాము బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగి లక్ష మార్క్‌ను దాటగా, ఈ రోజు మాత్రం ఒక్కసారి కాస్త తగ్గాయి.
డిస్‌ప్లే, పర్ఫామెన్స్, బ్యాటరీ అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చేసిన Huawei MatePad 12 X టాబ్లెట్
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు పసిడి రేట్లు ఒక్కసారిగా పడిపోవడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,13,800 నుంచి 1,700 తగ్గి 1,12,100కు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 1,24,150 నుంచి 1,860 తగ్గి 1,22,290కు పడిపోయింది. ఈ భారీ తగ్గుదలతో వివాహ సీజన్ లేదా దీపావళి పండుగల కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులు ఇప్పుడు బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు తగ్గినా, వెండి మాత్రం వ్యతిరేక దిశలో దూసుకెళ్లింది. నేడు వెండి ధర కిలోపై రూ.3,000 పెరిగి, రూ.1,80,000కు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలుదారులకు కొంత నిరాశ కలిగింది.
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏకంగా రూ.72 కోట్లు..!