స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల క్రితం థియేటర్లలో రిలీజై న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 10) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ ప్రకటించింది.. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది..త్రిష నటించిన ది రోడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్ డైరెక్ట్ చేశాడు. అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ఓ హైవే పై ఒకే చోట వరుసగా ప్రమాదాలు జరుగుతుండటం వెనుక వున్న మిస్టరీని ఛేదించే అమ్మాయి పాత్రలో త్రిష నటించింది.నిజ ఘటనల ఆధారంగా ది రోడ్ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది త్రిష మూడు సినిమాల్లో కనిపించగా.. ది రోడ్ మూవీ అందులో రెండవది…
ఈ సినిమాలో త్రిషతోపాటు షబ్బీర్, సంతోష్ ప్రతాప్, మియా జార్జ్ మరియు ఎమ్మెస్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ది రోడ్ మూవీని దర్శకుడు అరుణ్ వసీగరణ్ తెరకెక్కించాడు. ఫేక్ యాక్సిడెంట్స్‌కు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటోన్న ఓ ముఠా గుట్టును సాధారణ యువతి ఏ విధంగా కనిపెట్టింది..తన భర్త, కొడుకు మరణంపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదనే పాయింట్‌తో దర్శకుడు ది రోడ్ కథను రాసుకున్నాడు. సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు.పెద్ద క్రైమ్‌ను వెలికితీసే సాధారణ యువతిగా త్రిష యాక్టింగ్ ఎంతగానో మెప్పిస్తుంది.ఎమోషనల్ సీన్స్‌లో త్రిష ఎంతగానో మెప్పించింది. అమాయకుడి నుంచి విలన్‌గా మారే యువకుడిగా షబీర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. త్రిష స్నేహితురాలిగా మియాజార్జ్, కానిస్టేబుల్‌గా ఎమ్ మరియు ఎస్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.థియేటర్స్ లో అంతగా అకట్టుకోని ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి…