బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. నేడు తులంపై రూ. 500 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,808, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,990 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రభావితం అవడం వంటి కారణాలు పుత్తడి ధరల్లో మార్పుకు కారణమవుతున్నాయి.
Also Read:Acer Swift Neo: ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో.. ఏసర్ కొత్త ల్యాప్‌టాప్ విడుదల
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగింది. దీంతో రూ. 89,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగింది. దీంతో రూ. 98,080 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,230 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Off The Record: వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా మరిచిపోయినట్లేనా..?
బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,10,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 99,900 వద్ద ట్రేడ్ అవుతోంది.