గత రెండ్రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 660 పెరగగా, 100 గ్రాముల గోల్డ్ ధర రూ. 6,700 పెరిగి రూ. 10,01,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో సిల్వర్ ధర రూ. 2100 పెరిగింది. బంగారం వెండి ధరలు ఒక్కరోజే వేలల్లో పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురవుతున్నారు.
Also Read:Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక
హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,004, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,170 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగింది. దీంతో రూ.91,700 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 660 పెరిగింది. దీంతో రూ. 1,00,040 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:Rajinikanth : భాషా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్.. కానీ !
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,850 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,190 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండిపై రూ.2,100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,000 వద్ద ట్రేడ్ అవుతోంది.